High Court : హైదరాబాద్ – తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావుకు కోలుకోలేని షాక్ ఇచ్చింది. తను కోర్టు ధిక్కరణకు పాల్పడడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మీరు ఇలాగేనా వ్యవహరించేది అంటూ మండిపడింది. గ్రంథాలయ శాఖలో గత కొన్నేళ్లుగా స్వీపర్లుగా పని చేస్తున్నారు. తమకు పెంచిన వేతనాలు ఇవ్వడం లేదంటూ ఆరోపించారు. ఈ మేరకు తమకు న్యాయం చేయాలని కోరినా ఫలితం లేక పోవడంతో చివరకు హైకోర్టును (High Court) ఆశ్రయించారు. ఇందులో భాగంగా దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టింది కోర్టు. వాదోపవాదనలు విన్న అనంతరం జడ్జి కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Telangana High Court Slams CS
స్వీపర్లు కూడా మనుషులేనని, వారితో పని చేయించుకుంటున్నప్పుడు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనేది ఇప్పటికే రాజ్యాంగం స్పష్టం చేసిందని, ఇదే విషయాన్ని భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా వెల్లడించిందని పేర్కొంది హైకోర్టు. ఈ సందర్బంగా తాము జారీ చేసిన ఆదేశాలను అమలు చేయక పోవడం పట్ల కన్నెర్ర చేసింది ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావును. ఈ కేసులో సీఎస్ తో పాటు , గ్రంథాలయ ప్రధాన కార్యదర్శి ఎన్.శ్రీధర్, పబ్లిక్ లైబ్రరీస్ డైరెక్టర్ ఎస్.శ్రీనివాసా చారిలకు నోటీసులు జారీ చేసింది.
జీవో 841, 33 ప్రకారం లైబ్రేరియన్ గ్రేడ్-3తో సమానంగా పార్ట్ టైమ్ స్వీపర్లకు కూడా సమానంగా వేతనాలు చెల్లించాలని గత ఏడాది డిసెంబర్ 19వ తేదీన ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 24వ తేదీన వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని సీఎస్‌తో పాటు ఇద్దరు ఐఏఎస్ అధికారులను ఆదేశించింది హైకోర్టు.
Also Read : Trump Shocking Tariffs : ప్రపంచ దేశాల మీద మరోసారి మొదలు పెట్టిన ట్రంప్ టారిఫ్ లు
