Trump : ప్రపంచ వాణిజ్యంలో వేడి చల్లారనందే లేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన దిగుమతి సుంకాలు ఇప్పుడు ఆగస్టు 1కి వాయిదా పడ్డాయి. జపాన్, దక్షిణ కొరియాలపై ఇప్పటికే 25 శాతం సుంకాలు అమలులోకి రాగా, భారత్‌పై 26 శాతం ఎగుమతి సుంకాలు విధించాలని అమెరికా ప్రకటించింది. మొత్తం 180 దేశాలపై సుంకాలు విధించనున్నట్లు ట్రంప్ (Trump) ప్రకటించడం గమనార్హం.
Trump Shocking Tariffs
ఈ ఏడాది ఏప్రిల్‌లో 10 శాతం బేస్ టారిఫ్‌తో ప్రారంభమైన ఈ ప్రక్రియ కొన్ని దేశాలపై 50 శాతం వరకూ సుంకాలకు దారితీసింది. అయితే చర్చలకు సమయం ఇవ్వాలన్న ఉద్దేశంతో 10 శాతం పైగా ఉన్న సుంకాలను 90 రోజులు వాయిదా వేసారు. ఇప్పుడు ఆ గడువు జూలై 9తో ముగియనుంది.
ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ‘ట్రూత్’లో జపాన్, దక్షిణ కొరియా నేతలకు లేఖలు పోస్టు చేశారు. “మీరు ప్రతీకారంగా సుంకాలు పెంచితే, మేము మరోసారి అదనంగా విధిస్తాం. దీని ప్రభావం మీ ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్ రంగాలపై పడుతుంది” అని హెచ్చరించారు.
ఇదిలా ఉంటే, అమెరికాతో వాణిజ్య ఒప్పందాల కోసం భారత్ ఇటీవల చర్చలు జరుపుతోంది. వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయల్ నేతృత్వంలో సాగుతున్న ఈ చర్చలపై ఆశాభావం వ్యక్తమవుతోంది. ఒప్పందం కుదిరితే డెయిరీ, వ్యవసాయ రంగాలకు మినహాయింపులు రావచ్చని అంచనాలున్నాయి. అలాగే బట్టలు, చెప్పులు, లెదర్, స్టీల్, మెడిసిన్, అల్యూమినియం వంటి ఉత్పత్తులపై సుంకాలు తగ్గించాలని భారత్ కోరుతోంది.
ఇంకా అమెరికా తమతో ఒప్పందం కుదుర్చుకోని దేశాలకు ఆగస్టు 1 నుంచి భారీ సుంకాలు విధిస్తామని ముందస్తుగా లేఖల ద్వారా హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో భారత్‌కు తాత్కాలిక ఊరట లభించినప్పటికీ, వాణిజ్య ఒప్పందం బుధవారంలోపు కుదిరితేనే పూర్తి స్థాయిలో ప్రభావం తప్పించుకోగలమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read : Today Gold Price : పసిడి ప్రియులకు ఇక సంబరమే..స్వల్పంగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు
