మెగాస్టార్ మూవీ టికెట్ రేట్ల పెంచేందుకు ఓకే

ఆనందంలో మూవీ నిర్మాత‌లు, ద‌ర్శ‌కుడు

hellotelugu-ManaShankaraVaraPrasadGaru

హైద‌రాబాద్ : తెలంగాణ స‌ర్కార్ మెగాస్టార్ మూవీ టీంకు ఖుష్ క‌బ‌ర్ చెప్పింది. ఓ వైపు హైకోర్టు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసినా ప‌ట్టించు కోలేదు. న్యాయ‌మూర్తి సీరియ‌స్ కామెంట్స్ చేశారు. అయినా సీఎంలో, స‌ర్కార్ లో మార్పు రాక పోవ‌డం గ‌మ‌నార్హం. ఎందుకు టికెట్ రేట్లు పెంచాలంటూ ప్ర‌శ్నించారు. ఇదిలా ఉండ‌గా శ‌నివారం స‌ర్కార్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈ మేర‌కు మెగాస్టార్ చిరంజీవి, విక్ట‌రీ వెంక‌టేష్, న‌య‌నతార క‌లిసి న‌టించిన మ‌న శంక‌ర వ‌ర ప్ర‌సాద్ గారు మూవీ ఈనెల 12న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల అయ్యేందుకు సిద్ద‌మైంది. ఇప్ప‌టికే ఈ సినిమాకు సంబంధించిన ట్రైల‌ర్, గ్లింప్స్, సాంగ్స్ కు మంచి ఆద‌ర‌ణ ల‌భించింది. మ‌రో వైపు మాస్ మ‌హ‌రాజా ర‌వితేజ న‌టించిన మూవీ కూడా సంక్రాంతి పండుగ‌కు రానుంది. ఇదిలా ఉండ‌గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ప్ర‌భాస్ మూవీ ది రాజా సాబ్ ఎత్తి పోయింది. అట్ట‌ర్ ప్లాప్ అంటూ టాక్ వ‌చ్చింది.

తాజాగా త‌మ సినిమాకు సంబంధించి టికెట్ రేట్లు పెంచేందుకు ఛాన్స్ ఇవ్వాల‌ని కోరారు సినీ నిర్మాత‌లు. ఈ మేర‌కు సానుకూలంగా స్పందించింది స‌ర్కార్. ఈ పెంచిన ధరలు జనవరి 12 నుండి 18 వరకు ఏడు రోజుల పాటు వర్తిస్తాయని తెలిపింది జారీ చేసిన ఉత్త‌ర్వుల‌లో. . జనవరి 11న రాత్రి 8.30 గంటలకు జరిగే ప్రీమియర్ షో టికెట్ ధరను జీఎస్టీతో కలిపి రూ.600కి పెంచింది. అలాగే, అన్ని సింగిల్ స్క్రీన్ థియేటర్లకు రూ.50 వరకు, మల్టీప్లెక్స్‌లకు జీఎస్టీతో కలిపి రూ.100 వరకు ధరలను పెంచింది .ఈ పెంచిన ధరలకు సినిమాను ప్రదర్శించే అన్ని థియేటర్ల యాజమాన్యాలు, సినిమా ద్వారా వచ్చే అదనపు ఆదాయంలో 20 శాతాన్ని తప్పనిసరిగా తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఉద్యోగుల సమాఖ్య సంక్షేమ సంఘం ఖాతాకు జమ చేయాలని ఆదేశించింది.

Exit mobile version