Telangana : హైదరాబాద్ – తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. విద్యా శాఖ చేసిన సూచనల మేరకు దసరా పండుగ సందర్బంగా సెలవులను ప్రకటించింది. ఏపీలో కంటే తలంగాణలోనే ఎక్కువ రోజులు సెలవులు రానున్నాయి. వచ్చే నెల సెప్టెంబర్ 21 నుండి అక్టోబర్ 3 వరకు పాఠశాలలకు 13 రోజుల పాటు సెలవులు
ప్రకటించింది. ప్రభుత్వం చేసిన సూచనల మేరకు తెలంగాణ (Telangana) విద్యా శాఖ ఇప్పుడు 2025 దసరా సెలవుల షెడ్యూల్‌ను అధికారికంగా విడుదల చేసింది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు , ప్రభుత్వ , ప్రైవేట్ రెండూ సెప్టెంబర్ 21 నుండి అక్టోబర్ 3 వరకు మూసి వేయబడతాయి. కాబట్టి విద్యార్థులకు సుదీర్ఘ సెలవులు ఉంటాయి. అక్టోబర్ 4 తరగతులకు తిరిగి రావాల్సి ఉంటుంది.
Telangana Dussehra Holidays Update
ఈ సంవత్సరం బతుకమ్మ పండుగ , దసరా ఒకే రోజున వస్తాయి, దీని వల్ల విద్యార్థులకు 13 రోజుల విరామం లభిస్తుంది. విద్యా షెడ్యూల్ ప్రకారం పిల్లలు, ఉపాధ్యాయులు, కుటుంబాలు అన్ని వేడుకలలో పాల్గొన గలిగేలా ఈ పండుగ సీజన్ సెలవులు ఇవ్వ బడుతున్నాయి. సెలవు షెడ్యూల్‌లో అక్టోబర్ 2న గాంధీ జయంతి కూడా ఉంటుంది. ఇది జాతీయ ప్రభుత్వ సెలవు దినం. అక్టోబర్ 3 కూడా సెలవు దినం కావడంతో, విద్యార్థులు పండుగ వాతావరణాన్ని ఆస్వాదించడానికి పూర్తి సమయం లభిస్తుంది.
ఈ సుదీర్ఘ విరామంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రయాణం, కుటుంబ సమావేశాలు, ఉత్సవాల కోసం ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. విస్తృతమైన బతుకమ్మ వేడుకల తర్వాత రావణుడి దిష్టి బొమ్మలను ఆచార బద్ధంగా దహనం చేయడంతో సహా రంగు రంగుల దసరా ఊరేగింపులు ఉంటాయి.
Also Read : YSRCP Interesting Updates : ఎన్డీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్థికి వైసీపీ మద్దతు
