Minister Sridharbabu : హైదరాబాద్ : రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Minister Sridharbabu) కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఏఐకి రాను రాను ప్రాధాన్యత పెరుగుతోందన్నారు. ఇందులో భాగంగా ఏఐ హబ్ గా తెలంగాణ రాష్ట్రం మారబోతోందన్నారు. అంతే కాదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆవిష్కరణలకు దారులు తెరుస్తుందన్నారు. 2035 సంవత్సరం నాటికి ప్రపంచ వ్యాప్తంగా టాప్ 20 ఏఐ హబ్ లలో తెలంగాణ ఒకటిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు శ్రీధర్ బాబు. ఇందుకోసమే టీఏఐహెచ్ ఏర్పాటు చేయడం జరగిందన్నారు .ఆ మేరకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు దుద్దిళ్ల శ్రీధర్ బాబు.
Minister Sridharbabu Comments
పనిగట్టుకుని తాము వచ్చాక తెలంగాణకు ఏఐ పరంగా వరల్డ్ వైడ్ గా గుర్తింపు తీసుకు వచ్చేందుకు గాను తెలంగాణ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్నోవేషన్ హబ్ ను ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ ప్రాంతానికి చెందిన ఎంతో మంది ఈ రంగంలో కీలకమైన వ్యక్తులుగా ఉన్నారని పేర్కొన్నారు. వారందరి సహకారంతో ముందుకు వెళతామన్నారు. బహుళ రంగాలలో ఏఐ ఆధారిత ఆవిష్కరణ, పరిశోధన, సహకారానికి ఈ హబ్ కేరాఫ్ గా పని చేస్తుందన్నారు శ్రీధర్ బాబు. ఇందులో ప్రత్యేక ప్రభుత్వ కార్యదర్శి తో పాటు మీ సేవా కమిషనర్, ఎమర్జింగ్ టెక్నాలజీస్ జాయింట్ డైరెక్టర్ ఇన్నోవేషన్ హబ్ లో సభ్యులుగా ఉంటారని వెల్లడించారు.
Also Read : Minister Azharuddin Interesting Update : అజారుద్దీన్ కు శాఖలు కేటాయించిన సర్కార్
