Minister Azharuddin Interesting Update : అజారుద్దీన్ కు శాఖ‌లు కేటాయించిన స‌ర్కార్

ప్ర‌భుత్వ సంస్థ‌లు, మైనార్టీల సంక్షేమ శాఖ

Hello Telugu - Minister Azharuddin Interesting Update

Hello Telugu - Minister Azharuddin Interesting Update

Minister Azharuddin : హైద‌రాబాద్ : భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్ , టీపీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న మ‌హ‌మ్మ‌ద్ అజ‌హ‌రుద్దీన్ (Minister Azharuddin) తాజాగా రాజ్ భ‌వ‌న్ లో మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేశారు. రాజ్యాంగం ప్ర‌కారం త‌న‌కు శాఖ‌ల‌ను కేటాయించాల్సి ఉంటుంది. ఇప్ప‌టికే కాస్తా ఆల‌స్యం జ‌రిగింది. దీనిపై పెద్ద ఎత్తున ఉత్కంఠ నెల‌కొంది. ప‌లు చోట్ల చ‌ర్చ‌ల‌కు కూడా జ‌రిగాయి. ప్ర‌స్తుతం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కొన‌సాగుతోంది. ఈ త‌రుణంలో త‌ను ప్ర‌చారంలో బిజీగా పాల్గొంటున్నారు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి, హైక‌మాండ్ తో చ‌ర్చించారు. చివ‌ర‌కు అజారుద్దీన్ కు హోం శాఖ కేటాయిస్తార‌ని అంతా భావించారు. ఎందుకంటే గ‌తంలో బీఆర్ఎస్ హ‌యాంలో మైనార్టీకి ఇచ్చారు.

Minister Azharuddin Gets a Portfolios

త‌నకు కూడా హోం శాఖ కావాల‌ని అజారుద్దీన్ పట్టు ప‌ట్టిన‌ట్లు జోరుగా ప్ర‌చారం జ‌రిగింది. దీనికి పుల్ స్టాప్ పెట్టేశారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. మంగ‌ళ‌వారం మ‌హ‌మ్మ‌ద్ అజ‌హ‌రుద్దీన్ కు కీల‌క‌మైన శాఖ‌లు అప్ప‌గించారు. తెలంగాణ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో ప్రభుత్వ సంస్థలు, మైనారిటీల సంక్షేమ శాఖలు దక్కాయి. జనరల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, గతంలో ముఖ్యమంత్రి నిర్వహించిన ప్రభుత్వ సంస్థలతో పాటు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యవేక్షించిన మైనారిటీల సంక్షేమ శాఖను మంత్రి అజారుద్దీన్‌కు తిరిగి అప్పగించారు.

Also Read : Tom Moody Growth : ల‌క్నో జెయంట్స్ గ్లోబ‌ల్ డైరెక్ట‌ర్ గా టామ్ మూడి

Exit mobile version