Tejashwi Yadav Shocking Comments : రాహుల్ గాంధీ ప్ర‌ధాని కావ‌డం ఖాయం

సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన తేజ‌స్వి యాద‌వ్

Hello Telugu - Tejashwi Yadav Shocking Comments

Hello Telugu - Tejashwi Yadav Shocking Comments

Tejashwi Yadav : బీహార్ – ఆర్ఎల్డీ అగ్ర నాయ‌కుడు, మాజీ డిప్యూటీ సీఎం తేజ‌స్వి యాద‌వ్ (Tejashwi Yadav) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు. ఆయ‌నకు రోజు రోజుకు జ‌నాద‌ర‌ణ ల‌భిస్తోంద‌ని చెప్పారు. ఓట్ల చోరీకి సంబంధించి ఇవాళ దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌కు తీసుకు వ‌చ్చేలా చేసిన ఘ‌న‌త ఒక్క రాహుల్ గాంధీకే ద‌క్కుతుంద‌న్నారు. ఆయ‌న‌కు ఈ దేశానికి ప్ర‌ధాన‌మంత్రి అయ్యే అన్ని అర్హ‌త‌లు ఉన్నాయ‌ని చెప్పారు. ఇదిలా ఉండ‌గా రాహుల్ గాంధీ ఓట్ అధికార్ యాత్రకు శ్రీ‌కారం చుట్టారు బీహార్ నుంచి . సెప్టెంబ‌ర్ 1న స‌భ‌తో ముగుస్తుంది. ఈ యాత్ర 16 రోజుల పాటు కొన‌సాగుతుంది. ఆయ‌న‌తో పాటు తేజ‌స్వి యాద‌వ్ కూడా యాత్ర‌లో భుజం క‌లిపారు. ఈ సంద‌ర్బంగా ప్ర‌జ‌ల నుంచి వ‌స్తున్న స్పంద‌న‌ను చూసి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు రాహుల్ ను ఉద్దేశించి

Tejashwi Yadav Key Comments .

SIR అంటే ఓట్ల దోపిడీ త‌ప్ప మ‌రోటి కాద‌న్నారు . తాము ఎట్టి ప‌రిస్థితుల్లో జ‌ర‌గ‌నిచ్చే ప్ర‌స‌క్తి లేద‌న్నారు. బీహార్‌లో ఓటర్లను ఓటు హక్కును తొలగించడానికి ఇది పాలక వర్గం ప‌న్నిన కుట్ర అని ఆరోపించ‌చారు. దీనికి నిస్సిగ్గుగా కేంద్ర ఎన్నిక‌ల సంఘం మ‌ద్ద‌తు గా నిల‌వ‌డం బాధాక‌ర‌మ‌న్నారు తేజ‌స్వి యాద‌వ్. రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో, గత 20 సంవత్సరాలుగా పాత కారు లాంటి స‌ర్కార్ ను న‌డుపుతున్న ఎన్డీయేకు తగిన రీతిలో బుద్ది చెప్ప‌డం ఖయ‌మ‌న్నారు. త‌దుప‌రి లోక్ స‌భ ఎన్నిక‌ల్లో రాహుల్ గాంధీని ప్ర‌ధాన‌మంత్రిని చేస్తామ‌ని ధీమా వ్య‌క్తం చేశారు.

Also Read : GVMC Commissioner Interesting : ఛాయా చిత్ర ప్ర‌ద‌ర్శ‌న అద్భుతం

Exit mobile version