తమిళనాడు అసెంబ్లీలో జాతీయ గీతం వివాదం

ప్ర‌తిప‌క్ష డీఎంకేకు సీఎం జోసెఫ్ విజ‌య్ స‌వాల్

hellotelugu-TaamilnaduAssembly

చెన్నై : త‌మిళ‌నాడు శాస‌న స‌భ దద్ద‌రిల్లి పోయింది అరుపులు కేక‌ల‌తో. మ‌రోసారి జాతీయ గీతం విష‌యం వివాదానికి దారి తీసింది. ప్రతిపక్ష డీఎంకేకు సీఎం విజయ్ సవాల్ విసిరారు. ఈ సంద‌ర్బంగా 2021 నాటి ఒక సంఘటనను ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రభుత్వ కార్యక్రమాలలో జాతీయ గీతం తర్వాత రాష్ట్ర గీతాన్ని (తమిళ్ తాయ్ వాజ్తు) వాయించడం అప్పటి అధికారిక విధానమని ముఖ్యమంత్రి విజయ్ పేర్కొన్నారు. ‘తమిళ్ తాయ్ వాజ్తు’ కంటే జాతీయ గీతానికి ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపే తమిళనాడు అసెంబ్లీ రికార్డులను ఉటంకిస్తూ, ప్రభుత్వ కార్యక్రమాల్లో రాష్ట్ర గీతానికి ముందు జాతీయ గీతాన్ని వాయించడంపై ప్రతిపక్ష డీఎంకే వైఖరిని ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ మంగళవారం సవాలు చేశారు. మే నెలలో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ సమక్షంలో జరిగిన తన ప్రమాణ స్వీకార కార్యక్రమం సందర్భంగా, అలాగే జూన్ 18న అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం ప్రారంభంలోనూ, ముగింపులోనూ జాతీయ గీతాన్ని రెండుసార్లు వాయించినప్పుడు డీఎంకే ద్వంద్వ ప్రమాణాలను ప్రదర్శించిందని విజయ్ విమర్శించారు.

ఆ క్రమంలో ‘తమిళ్ తాయ్ వాజ్తు’కు మొదటి స్థానం ఇవ్వలేదని వారు ఆరోపించడం సరికాదన్నారు. ఆగస్టు 2, 2021న జరిగిన తమిళనాడు శాసనసభ శతజ యంతి ఉత్సవాల సందర్భంగా – అప్పటి భారత రాష్ట్రపతి చేతుల మీదుగా దివంగత ముఖ్యమంత్రి ఎం. కరుణానిధి చిత్రపటం ఆవిష్కరించ బడినప్పుడు – జాతీయ గీతం తర్వాత ‘తమిళ్ తాయ్ వాజ్తు’ వాయించడం అధికారిక విధానంగా పాటించ బడిందని సీఎం విజ‌య్ జోసెఫ్ చంద్ర‌శేఖ‌ర్ గుర్తు చేశారు. జాతీయ గీతాన్ని రెండుసార్లు వాయించడం లేదా రాష్ట్ర గీతాన్ని రెండవ స్థానంలో ఉంచడం వంటి పద్ధతులు డీఎంకే హయాంలోనే జరిగాయని, కాబట్టి వారి ప్రస్తుత విమర్శలు కపట పూరితమైనవి అని ఆయన నొక్కి చెప్పారు.

Exit mobile version