విజ‌య్ త్రిష‌ల ప్రేమాయ‌ణం ముగిసిందా..?

త‌మిళ సినీ, రాజ‌కీయ రంగాల‌లో ప్ర‌చారం

hellotelugu-VijayTrisha

చెన్నై : త‌మిళ చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అత్యంత జ‌నాద‌ర‌ణ పొందిన న‌టీ న‌టుల‌లో విజ‌య్ జోసెఫ్ చంద్ర‌శేఖ‌ర్, అందాల తార త్రిష కృష్ణ‌న్. ఈ ఇద్ద‌రూ ఎన్నిక‌ల కంటే ముందు క‌లిసి తిరాగారు. చాలా ఫంక్ష‌న్ ల‌కు , కార్య‌క్ర‌మాల‌కు హాజ‌ర‌య్యారు. ఇదే స‌మ‌యంల ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు. ఆపై దేశ వ్యాప్తంగా సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ గా ఉన్నారు. ఈ త‌రుణంలో విజ‌య్ టీవీకే పార్టీ ఊహించ‌ని విధంగా 234 సీట్ల‌కు గాను 108 సీట్లు గెలుపొందింది. ప్ర‌స్తుతం ఆయ‌న త‌మిళనాడు రాష్ట్రానికి నూత‌న ముఖ్య‌మంత్రిగా కొలువు తీరారు. సంత‌కం చేసిన వెంట‌నే సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకుంటూ పాల‌నా ప‌రంగా ప్ర‌జా నాయ‌కుడిగా గుర్తింపు పొందారు. ఇదే పేరుతో ఆయ‌న సినిమా కూడా తీశాడు. కానీ ఇంకా విడుద‌ల తేదీ ఖ‌రారు కాలేదు. జూన్ 22న పుట్టిన రోజు జ‌రుపుకున్నారు.

త‌ను సీఎం కావ‌డం ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేస్తూ త్రిష కృష్ణ‌న్ కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా విల‌సిల్లిన తిరుమ‌ల శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామిని ద‌ర్శించుకున్నారు. ఇదే క్ర‌మంలో న‌టుడు విజ‌య్ , భార్య సంగీత మ‌ధ్య విభేదాలు పొడ చూపాయి. ఇద్ద‌రూ త‌మ‌కు విడాకులు కావాల‌ని కోర్టుకు ఎక్కారు. ఆ కేసు ఇంకా న‌డుస్తోంది. దీనికి ప్ర‌ధాన కార‌కురాలు త్రిష కృష్ణ‌న్ అనే ఆరోప‌ణ‌లు లేక పోలేదు. అయితే తాజాగా విజ‌య్, సంగీత‌లు ఇద్దరూ క‌లిసి ఉండేలా విజ‌య్ త‌ల్లి ప్ర‌య‌త్నం చేసింద‌ని, గొడ‌వ‌ల‌కు పుల్ స్టాప్ ప‌డింద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇక ఇప్ప‌టి వ‌ర‌కు క‌లిసి తిరిగిన త్రిష , విజ‌య్ ల మ‌ధ్య ప్రేమాయ‌ణం ముగిసిందా అన్న అనుమానం నెల‌కొంది.

Exit mobile version