Tejashwi Yadav : బీహార్ : ఆర్జేడీ నాయకుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ (Tejashwi Yadav) సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ కూటమి ఇప్పటికే రాష్ట్రానికి సంబంధించి గెలిస్తే ఎవరు ముఖ్యమంత్రి స్థానంలో ఉంటారనేది ప్రకటించడం జరిగిందన్నారు. దమ్ముంటే ఎన్డీయే కూటమి తమ సీఎం అభ్యర్థి ఎవరో తేల్చాలని డిమాండ్ చేశారు. మంగళవారం తేజస్వి యాదవ్ మీడియాతో మాట్లాడారు. కేవలం వ్యక్తిగత ఆరోపణలు తప్ప చేసింద ఏముందని ప్రశ్నించారు. తమకు స్పష్టమైన ప్రణాళిక ఉందన్నారు. గెలిచిన వెంటనే గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ ఇస్తామని ప్రకటించారు. అన్ని వర్గాలకు సమాన , ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుందన్నారు మాజీ డిప్యూటీ సీఎం.
Tejashwi Yadav Shocking Comments on Bihar Govt
రాబోయే ఐదు సంవత్సరాలకు రోడ్ మ్యాప్‌ను వివరిస్తూ ‘తేజస్వి ప్రాణ్ పాత్ర’ అనే తన కూటమి మ్యానిఫెస్టోను విడుదల చేశారు. ఈసందర్బంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక్కడ ప్రజలు ప్రధానంగా ఎన్డీయే ఎజెండా, మేనిఫెస్టోను తెలుసు కోవాలని కోరుకుంటున్నారని తెలిపారు. ఇవాళ మేం పూర్తిగా భరోసా ఇచ్చాం. మాకు విజన్ ఏమిటనేది స్పష్టంగా ఉందన్నారు తేజస్వి యాదవ్. రాబోయే ఐదు సంవత్సరాలు ఎలా పని చేయాలనే దానిపై క్లారిటీ ఉందన్నారు. అందుకే తేజస్వి ప్రాణ్ పత్రను విడదల చేయడం జరిగిందని చెప్పారు. దమ్ముంటే ఎన్డీయే తమ తరపు ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో తేల్చాలని సవాల్ విసిరారు.
Also Read : CM Chandrababu Important Meeting For Cyclone : ముంచు కొస్తున్న మొంథా తుపానుపై సర్కార్ అప్రమత్తం
