CM Chandrababu : అమరావతి : ఏపీని గడగడ లాడిస్తోంది మొంథా తుపాను. 3,778 గ్రామాలలో పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ముందస్తు చర్యలు తీసుకున్నా అక్కడక్కడ ఇబ్బందులు తప్పడం లేదు. దీంతో స్వయంగా రంగంలోకి దిగారు సీఎం నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu). మంగళవారం ఏపీపై మొంథా తుఫాను ప్రభావంపై ఆర్టీజీఎస్ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సమీక్షకు హాజరయ్యారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేష్, వి.అనిత, పి. నారాయణ, సీఎస్ విజయానంద్, వివిధశాఖల అధికారులు. ప్రస్తుతం తుఫాను తీరానికి దగ్గరగా వస్తోందని, కోస్తాంధ్ర జిల్లాలపై దీని ప్రభావం ప్రారంభమైందని చెప్పారు ఉన్నతాధికారులు.
CM Chandrababu Important Meeting For Montha Cyclone
ప్రధానంగా కాకినాడ, మచిలీపట్నం, విశాఖ తదితర తీరప్రాంతాల్లో వర్షాలు, గాలుల తీవ్రత ఎక్కువగా ఉందన్నారు. ఈ సందర్బంగా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు ముఖ్యమంత్రి. గతంలో వచ్చిన తుఫానుల నష్టాన్ని బేరీజు వేసుకుని తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు .తుఫాను తీరం దాటే కాకినాడ, ఆ పరిసర ప్రాంతాలకు రెస్క్యూ, ఎన్డీఆర్ఎఫ్,ఎస్డీఆర్ఎఫ్ బృందాలను పంపాలని స్పష్ట చేశారు. గాలులు, వర్ష తీవ్రతను ముందుగానే అంచనా వేసి అందుకు తగినట్టుగా జాగ్రత్త వహించాలని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా విశాఖ, ఉమ్మడి ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే అలర్ట్ చేసింది వాతావరణ శాఖ.
Also Read : AP Montha Cyclone Sensational : ఆంధ్రప్రదేశ్ ను ముంచెత్తిన వాన
