India : దుబాయ్ : ఆసియా కప్ టోర్నీలో భాగంగా దుబాయ్ వేదికగా చిరకాల ప్రత్యర్థి దాయాది పాకిస్తాన్ తో జరిగిన కీలక పోరులో భారత్ (India) సత్తా చాటింది. ఈ సందర్భంగా ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఇటీవల పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో 26 మంది అమాయకుల ప్రాణాలను పొట్టన పెట్టుకున్నారు. దీంతో భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో దాడి చేసింది. చివరకు పాకిస్తాన్ దారికొచ్చింది. సంధి కుదుర్చుకుందామని కోరింది. ఆ తర్వాత ఇరు దేశాల జట్ల మధ్య మ్యాచ్ ఆడ కూడదంటూ పెద్ద ఎత్తున దేశ వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. చివరకు టోర్నీలో ఆడేందుకు ఒప్పుకున్నాయి. కానీ తటస్థ వేదిక అయితేనే ఆడతామని స్పష్టం చేసింది బీసీసీఐ. ఈ మేరకు భద్రత దృష్ట్యా పాకిస్తాన్ తో ఆడేది లేదని కేంద్రం ప్రకటించింది.
Indian Cricket Team Growth
ఈ తరుణంలో ఈ మ్యాచ్ సాగుతుందా లేదా అన్న అనుమానం మొదలైంది. చివరకు మ్యాచ్ ఏకపక్షంగా సాగింది. ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 9 వికెట్లు కోల్పోయి 127 రన్స్ చేసింది. అనంతరం టీమిండియా నిర్ణీత ఓవర్ల కంటే లక్ష్యాన్ని ఛేదించింది. 15.5 ఓవర్లలోనే పని కానిచ్చేసింది. విజయం సాధించిన తర్వాత ఇరు జట్లు కరచాలనం చేసుకోవడం ఆనవాయితీ. కానీ భారత జట్టు ఇందుకు ఒప్పుకోలేదు. మ్యాచ్ అనంతరం పాక్ కెప్టెన్, ఆటగాళ్లతో షేక్ హ్యాండ్ ఇవ్వకుండానే పెవిలియన్ కు వెళ్లి పోయారు. అనంతరం మీడియాతో మాట్లాడాడు. పెహల్గామ్ దాడికి నిరసనగా కరచాలనం చేయలేదని, ఈ విజయాన్ని ఆపరేషన్ సిందూర్ కు అంకితం ఇస్తున్నామని ప్రకటించాడు.
Also Read : India Vs Pakistan Sensational Match : భారత్ భళా పాకిస్తాన్ విలవిల


















