ఆసియా క్రీడ‌ల్లో ఫైన‌ల్ కు చేరిన టీమిండియా

సెమీ ఫైన‌ల్ లో ఓటమి పాలైన శ్రీ‌లంక జ‌ట్టు

hellotelugu-INDvsSLAsianGames

జ‌పాన్ : ఆసియా క్రీడ‌ల‌లో భాగంగా జ‌రుగుతున్న క్రికెట్ మ్యాచ్ లో భార‌త జ‌ట్టు ఫైన‌ల్ కు చేరుకుంది. త‌న చిర‌కాల ప్ర‌త్య‌ర్థి పాకిస్తాన్ తో ఫైన‌ల్ లో త‌ల‌ప‌డ‌నుంది. ఏకంగా 124 ప‌రుగుల తేడాతో గెలుపొందింది. జపాన్‌లోని నిషిన్‌లో జరుగుతున్న 20వ ఆసియా క్రీడల్లో భాగంగా గురువారం జరిగిన రెండో సెమీఫైనల్ టీ20 మ్యాచ్‌లో శ్రీలంకపై భారత్ భారీ తేడాతో విజయం సాధించి, ఫైనల్‌లో పాకిస్థాన్‌తో తలపడేందుకు సిద్ధమైంది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ 46 బంతుల్లో 4 బౌండరీలు, 5 సిక్సర్లతో అజేయంగా 80 పరుగులు చేయగా, ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ 21 బంతుల్లో 38 పరుగులు చేసి జట్టుకు మంచి ఆరంభాన్ని అందించారు. అనంతరం బౌలింగ్‌లో జస్ప్రీత్ బుమ్రా (2/7), అక్షర్ పటేల్ (2/8), అభిషేక్ శర్మ (2/2), వాషింగ్టన్ సుందర్ (1/18) రాణించడంతో శ్రీలంక జట్టు 9.5 ఓవర్లలో కేవలం 45 పరుగులకే కుప్ప కూలింది.

శ్రీలంక బ్యాటర్లలో నువనిడు ఫెర్నాండో (15) మాత్రమే రెండంకెల స్కోరు సాధించగా, ఐదుగురు బ్యాటర్లు కనీసం ఖాతా కూడా తెరవలేక పోయారు. అంతకు ముందు బౌలింగ్‌లో సహన్ అరచ్చిగే (2/28), తరిందు రత్నాయకే (2/32) చెరో రెండు వికెట్లు పడగొట్టగా, వనుజ సహన్ (1/17), నువనిడు ఫెర్నాండో (1/20), లసిత్ క్రూస్‌పుల్లె (1/25) తలో వికెట్ సాధించారు. సంక్షిప్త స్కోర్ల విష‌యానికి వ‌స్తే భారత్: 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 169 పరుగులు (ఇషాన్ కిషన్ 80; సహన్ అరచ్చిగే 2/28). శ్రీలంక: 9.5 ఓవర్లలో 45 పరుగులకు ఆలౌట్ (నువనిదు ఫెర్నాండో 15; జస్ప్రీత్ బుమ్రా 2/7, అక్షర్ పటేల్ 2/8, అభిషేక్ శర్మ 2/2).

Exit mobile version