అజిత్ పవార్ మృతి వెనుక టీడీపీ నేత‌ల హ‌స్తం

ఎన్సీపీ నేత రోహిత్ ప‌వార్ షాకింగ్ కామెంట్స్

helloteugu-RohitPawar

ముంబై : అజిత్ పవార్ విమాన ప్రమాదంపై ఎన్‌సీపీ నాయకుడు రోహిత్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రమాదానికి గురైన విమానం వీఎస్ఆర్ సంస్థ యజమాని రోహిత్ సింగ్ ది అని పేర్కొన్నారు. త‌కు టీడీపీ నాయకులకు సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. ఇటీవల రాజస్థాన్‌లో జరిగిన రోహిత్ సింగ్ కుమారుడి వివాహానికి కేంద్ర విమాన‌యాన శాఖ మంత్రి రామ్మోహ‌న్ నాయుడు హాజరయ్యారని అన్నారు. ఈ నేపథ్యంలో ప్రమాదం పట్ల నిష్పక్షపాత విచారణ జరుగుతుందని త‌మ‌కు న‌మ్మ‌కం లేద‌న్నారు. అంత వ‌ర‌కు , వాస్త‌వాలు ఏమిటో తెలిసేంత వ‌ర‌కు త‌న‌ను ఏవియేష‌న్ శాఖ నుంచి త‌ప్పించాల‌ని డిమాండ్ చేశారు. అంతేకాకుండా డీజీసీఏ అధికారుల‌ను కూడా వెంట‌నే తొల‌గించాల‌న్నారు.

రోహిత్ ప‌వార్ మీడియాతో మాట్లాడారు. ఈ కేసును ప్రమాదవశాత్తు జ‌రిగిన ఘ‌ట‌న‌గా కాకుండా అప‌రాధ హ‌త్య‌గా విచార‌ణ చేప‌ట్టాల‌ని అన్నారు. కంపెనీ యజమానులతో పాటు సాంకేతిక సిబ్బందిపై కూడా ఎఫ్ఐఆర్ న‌మోదు చేయాల‌ని డిమాండ్ చేశారు. దీని వెనుక భారీ కుట్ర కోణం దాగి ఉంద‌ని ఆవేద‌న చెందారు. ద‌ర్యాప్తు సంస్థ‌లు ఎంత బ‌లంగా ఉన్న‌ప్ప‌టికీ కేంద్ర మంత్రివ‌ర్గంలో రామ్మోహ‌న్ నాయుడు కీల‌క‌మైన ప‌ద‌విలో ఉండ‌డం వ‌ల్ల ఈ ద‌ర్యాప్తు విచార‌ణ స‌రిగా జ‌రుగుతుంద‌న్న న‌మ్మ‌కం త‌మ‌కు లేద‌న్నారు రోహిత్ ప‌వార్.

Exit mobile version