హైదరాబాద్ : అత్యంత జనాదరణ పొందిన రియాల్టీ షో బిగ్ బాస్ -9 ముగిసింది. గత కొంత కాలంగా జియో హాట్ స్టార్ స్టార్ మాలో ప్రసారం అవుతూ వచ్చింది. చివరకు ఎన్నో ట్విస్టుల మధ్య అంతిమ విజేత ఎవరో తేలి పోయింది. ఈ విషయాన్ని హైదరాబాద్ వేదికగా జరిగిన గ్రాండ్ ఫినాలే కార్యక్రమంలో కార్యక్రమ నిర్వాహకుడు , ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున ప్రకటించారు. బిగ్ బాస్ -9 రియాల్టీ షో విన్నర్ గా కళ్యాణ్ పడాల నిలవగా రన్నరప్ గా ఎందరో హృదయాలను దోచుకున్న కర్ణాటకకు చెందిన తనూజ పుట్టస్వామి నిలిచారు. ఇక మూడో స్థానంలో కామెడీని పండిస్తూ అలరించిన ఇమ్మాన్యూయెల్ నిలిచాడు. విజేతగా నిలిచిన కళ్యాణ్ పడాలకు రూ. 35 లక్షల నగదుతో పాటు ఓ మారుతీ కారు, ఇంకో స్పాన్సర్ నుంచి రూ. 5 లక్షల నగదు దక్కింది.
ఇక రన్నరప్ గా నిలిచిన తనూజ పుట్టస్వామి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. చివరి దాకా అంతిమ విజేతగా నిలిచేందుకు తీవ్ర ప్రయత్నం చేశారు. ఇక తనూజ స్వస్థలం కర్ణాటక. తనను అక్కడ అందరూ తనూజ గౌడ అని పిలుచుకుంటారు. 5వ తేదీ మార్చి 1997లో పుట్టింది. స్వస్థలం కర్ణాటక రాజధాని బెంగళూరు. తను వృత్తి పరంగా నటి, టెలివిజన్ కళాకారిణి కూడా. తెలుగు, తమిళ, కన్నడ సినీ , వినోద రంగంలో పని చేస్తూ వచ్చారు. ఆమె తన సినీ కెరీర్‌ను 6-5=2 అనే కన్నడ చిత్రంతో ప్రారంభించారు. ఆ తర్వాత దండే బాయ్స్ చిత్రంలో నటించింది. 1,500 కంటే ఎక్కువ ఎపిసోడ్‌ల పాటు ప్రసారమైన ముద్ద మందారం అనే తెలుగు సీరియల్‌లో పార్వతి పాత్రలో ప్రధాన పాత్ర పోషించింది. ఈ సీరియల్ ద్వారా అత్యంత ప్రాచుర్యం పొందింది. తనూజ పుట్టస్వామి శివ మనసుల శక్తి అనే తమిళ టీవీ షోలో కూడా నటించింది. కుకు విత్ జతిరత్నాలు వంటి వినోద కార్యక్రమంలో పాల్గొంది.
