Annamalai Shocking Comments : ద‌ళ‌పతి విజ‌య్ వీకెండ్ లీడ‌ర్ : అన్నామ‌లై

వీకేసీ పార్టీ చీఫ్‌, న‌టుడిపై షాకింగ్ కామెంట్స్

Hello Telugu - Annamalai Shocking Comments

Hello Telugu - Annamalai Shocking Comments

Annamalai : చెన్నై : త‌మిళ‌నాడు భార‌తీయ జ‌న‌తా పార్టీ మాజీ అధ్య‌క్షుడు అన్నామ‌లై సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. వీకేసీ ప్రెసిడెంట్, ప్ర‌ముఖ న‌టుడు ద‌ళ‌ప‌తి విజ‌య్ పై భ‌గ్గుమ‌న్నారు. శుక్ర‌వారం అన్నామ‌లై (Annamalai) మీడియాతో మాట్లాడారు. త‌ను పొలిటిక‌ల్ లీడ‌ర్ న‌ని భావిస్తున్నాడ‌ని, ఆయ‌న ఇంకా న‌టుడి ప‌రిధి దాటి బ‌య‌ట‌కు రావ‌డం లేదంటూ ఎద్దేవా చేశాడు. ఇదే స‌మ‌యంలో విజ‌య్ వారంతాపు (వీకెండ్ ) లీడ‌ర్ అంటూ ఎద్దేవా చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. వారాంతాల్లో మాత్రమే రాజకీయంగా చురుగ్గా ఉంటాడ‌ని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎన్నిక‌లు ఎప్పుడు వ‌చ్చినా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నామ‌ని ప్ర‌క‌టించారు అన్నామ‌లై. దేశంలో ఎక్క‌డా లేని కార్య‌క‌ర్త‌ల బ‌లం త‌మ‌కు ఉంద‌న్నారు.

Annamalai Slams Thalapathy Vijay

బీజేపీ మాత్ర‌మే డీఎంకేకు స‌రైన ప్ర‌త్యామ్నాయం అని వీకేసీ కాద‌న్నారు బీజేపీ మాజీ చీఫ్‌. రాజకీయాలలో రాణించాల‌న్నా లేదా ప్ర‌జ‌ల‌కు సేవ చేయాలంటే సినిమాలు, కామెంట్స్ ముఖ్యం కాద‌న్నారు. 24 గంట‌లు జ‌నానికి అందుబాటులో ఉండాల‌న్నారు అన్నామ‌లై. కానీ ద‌ళ‌ప‌తి విజ‌య్ త‌న‌ను తాను గొప్ప‌గా ఊహించు కుంటున్నార‌ని, దీనిని ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నార‌ని చెప్పారు. ఆయ‌న‌కు సీఎం అయ్యే యోగ్య‌త లేద‌న్నారు అన్నామ‌లై. ఇదిలా ఉండ‌గా రాష్ట్రంలో రాజ‌కీయాలు మ‌రింత వేడిని రాజేస్తున్నాయి. తమిళగ వెట్రీ కజగం ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలనుకుంటే, అది రాజకీయాలను తీవ్రంగా పరిగణించి, 24 గంటలు పని చేయడం ద్వారా తన ఉద్దేశాలను చర్యల ద్వారా చూపించాలని ఆయన సలహా ఇచ్చారు.

Also Read : Bhumana Fired on TTD EO : వేద పారాయ‌ణ‌దార్ల‌ ఇంటర్వ్యూల నిలిపి వేత త‌గ‌దు

Exit mobile version