Bhumana Fired on TTD EO : వేద పారాయ‌ణ‌దార్ల‌ ఇంటర్వ్యూల నిలిపి వేత త‌గ‌దు

టీటీడీ చైర్మ‌న్ , ఈవోల‌పై భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి ఫైర్

Hello Telugu - Bhumana Fired on TTD EO

Hello Telugu - Bhumana Fired on TTD EO

Bhumana : తిరుప‌తి : వేద పారాయణాదార్ల ఇంటర్వ్యూలను టీటీడీ అర్ధాంత‌రంగా నిలిపి వేయడంపై టీటీడీ మాజీ చైర్మ‌న్, వైసీపీ అధికార ప్ర‌తినిధి భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి (Bhumana) తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దీనిని తీవ్రంగా ఖండించారు. శుక్ర‌వారం భూమ‌న తిరుప‌తిలో మీడియాతో మాట్లాడారు. ఉన్న‌ప‌ళంగా ఎలా నిలిపి వేస్తారంటూ ప్ర‌శ్నించారు. టీటీడీ చీఫ్‌గా తన పదవీకాలంలో వేద పారాయణను ప్రోత్సహించడానికి , హిందూ సంప్రదాయాలను పరిరక్షించడానికి 700 వేదపారాయణాదార్ పోస్టులను సృష్టించారని భూమన గుర్తు చేసుకున్నారు. కృష్ణ యజుర్వేద పండితుడు ఫణియజ్ఞేశ్వర యాజులు మద్దతుతో డిప్యూటీ చీఫ్ గోవింద‌రాజుల ఆధ్వ‌ర్యంలో నియామ‌క ప్ర‌క్రియ‌కు శ్రీ‌కారం చుట్ట‌డం జ‌రిగింద‌న్నారు.

Bhumana Karunakar Reddy Slams TTD EO’s

అయితే ప్రస్తుత టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు ఉద్దేశ పూర్వకంగా ఈ ప్రక్రియను నిలిపివేసి, నిజాయితీపరుడైన అధికారిగా అభివర్ణించిన గోవిందరాజన్‌ను పక్కన పెట్టారని ఆయన ఆరోపించారు. 700 మంది వేదపారాయణదార్లను నియమిస్తే, వేద మంత్రోచ్ఛారణను నిర్ధారించడం ద్వారా అన్ని దేవాలయాలకు ప్రయోజనం చేకూరుతుంది అని భూమన క‌రుణాక‌ర్ రెడ్డి అన్నారు. కొంతమంది వ్యక్తులకు అనుకూలంగా నియామకాలను నిలిపి వేస్తున్నారని, దీనిని కుట్రగా అభివర్ణించారు. నియామకాలను ఆపడానికి ఫిర్యాదులు, లేఖలను ఒక సాకుగా చూపిస్తున్నార‌ని ఆరోపించారు. దీని కార‌ణంగా యావ‌త్ బ్రాహ్మ‌ణ స‌మాజం తీవ్ర ఆవేద‌న‌కు గురైంద‌న్నారు. టిటిడి తన మునుపటి నిర్ణయాన్ని గౌరవించాలని, హిందూ సంప్రదాయాలను కాపాడటానికి నియామక ప్రక్రియను తిరిగి ప్రారంభించాలని కోరారు.

Also Read : Nepal Interm PM-Sushila Karki Interesting : నేపాల్ తాత్కాలిక ప్ర‌ధానిగా సుశీలా క‌ర్కి

Exit mobile version