ఎవ‌రీ అంజ‌లీ భ‌ర‌ద్వాజ్ ఏమిటా క‌థ‌..?

సీఈసీ నిర్వాకంపై సుప్రీంకోర్టు సీరియ‌స్

hellotelugu-AnjaliBharadwaj

హైద‌రాబాద్ : ఎవ‌రీ అంజ‌లీ భ‌ర‌ద్వాజ్ అనుకుంటున్నారా. త‌ను మ‌రోసారి సంచ‌ల‌నంగా మారారు దేశ వ్యాప్తంగా. త‌ను సామాజిక కార్య‌క‌ర్త‌గా గుర్తింపు పొందారు. ప‌లు అంశాల‌పై నిల‌దీస్తూ, ప్ర‌శ్నిస్తూ వ‌స్తున్నారు. తాజాగా సుప్రీంకోర్టులో కేంద్ర ఎన్నిక‌ల సంఘం చీఫ్ క‌మిష‌న‌ర్ నిర్వాకం కార‌ణంగా కూలీలు ప‌డుతున్న ఇబ్బందుల గురించి ప్ర‌త్యేకంగా దావా దాఖ‌లు చేశారు. దీనిపై విచార‌ణ చేప‌ట్టిన కోర్టు సంచ‌ల‌న తీర్పు చెప్పింది. ఈ సంద‌ర్బంగా తీవ్ర‌స్థాయిలో మండిప‌డింది . అంజ‌లీ భ‌ర‌ద్వాజ్ నిత్యం ప్ర‌జ‌ల గొంతుక‌గా ఉన్నారు. ప్రభుత్వ పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం, అవినీతి నిర్మూలన కోసం అనేక సంవత్సరాలుగా పని చేస్తున్నారు. అలుపెరుగ‌ని రీతిలో పోరాటం చేస్తున్నారు. త‌ను ఢిల్లీ విశ్వ విద్యాలయంతో పాటు ఆక్స్‌ఫర్డ్ యూనివ‌ర్శిటీలో కూడా ఉన్నత విద్య చ‌దివారు. త‌ను కొన్నేళ్లుగా
నాలుగు అంశాలపై పని చేస్తున్నారు. ఇందులో ప్ర‌ధానంగా స‌మాచార హ‌క్కు చ‌ట్టం, అవినీతిపై పోరాటం, ప్ర‌భుత్వంలో జ‌వాబుదారీత‌నం , ప్ర‌జా సంక్షేమం, ఆహార భ‌ద్ర‌త‌, పేద‌ల హ‌క్కులు, ప్ర‌భుత్వ ప‌థ‌కాల అమ‌లుపై పోరాడుతున్నారు అంజ‌లీ భ‌ర‌ద్వాజ్.

త‌ను స‌త్ర‌క్ నాగ‌రిక్ సంఘ‌ట‌న్ సంస్థ‌ను 2023లో స్థాపించారు. ప్రభుత్వ పనితీరును పర్యవేక్షించడం, ప్రజలకు ఆర్టీఐ చట్టంపై అవగాహన కల్పించడం దీని ముఖ్య ఉద్దేశాలు. నేష‌న‌ల్ క్యాంపెయిన్ ఫ‌ర్ పీపుల్స్ రైట్ టు ఇన్ఫ‌ర్మేష‌న్ (ఎన్సీపీఆర్టీ) జాతీయ ఉద్య‌మానికి స‌హ క‌న్వీన‌ర్ గా ప‌ని చేస్తున్నారు అంజ‌లీ భ‌ర‌ద్వాజ్. ఆర్టీఐ చట్టం రూపకల్పన, అమలు, పరిరక్షణలో ఈ ఉద్యమం కీలక పాత్ర పోషించింది. ఈ సంద‌ర్బంగా ఆమెకు అనేక అవార్డులు, రివార్డులు ద‌క్కాయి. ఇదిలా ఉండ‌గా అమెరికా విదేశాంగ శాఖ ఆమెను ప్రపంచ వ్యాప్తంగా ఎంపిక చేసిన 12 మంది అవినీతి వ్యతిరేక పోరాట యోధుల్లో ఒకరిగా గుర్తించింది. ప్రజలకు ప్రభుత్వ సమాచారం అందుబాటులో ఉంటేనే ప్రజాస్వామ్యం బలపడుతుందని ఆమె విశ్వసిస్తారు. ప్రభుత్వ నిధులు ఎక్కడ ఖర్చవుతున్నాయి? ప్రజాప్రతినిధులు తమ బాధ్యతలను ఎంతవరకు నిర్వర్తిస్తున్నారు? ప్రభుత్వ పథకాలు పేదలకు చేరుతున్నాయా? వంటి అంశాలపై త‌ను పని చేస్తున్నారు.

ప్ర‌స్తుతం అంజ‌లీ భ‌ర‌ద్వాజ్ దేశ ప్రజల కష్టాలను చూసి చలించి పోయారు. ఎలక్షన్ కమిషన్ పై సుప్రీమ్ కోర్టులో కేసు వేసి కీలక ఆదేశాలను ఇప్పించ గలిగింది. దేశంలో కోట్లాదిగా ఉన్న కూలీ నాలీ జనాలని, కష్టజీవులనూ.. జ్ఞానేష్ కుమార్ ఇక్కట్ల పాలు చేస్తున్నాడంటూ.. సుప్రీంకోర్టు దృష్టికి తీసుకు వచ్చింది. ఆమె పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ కు తలంటు పోసింది. “సోయిలో ఉండే పని చేస్తున్నారా? ఇల్లు మారిన వాళ్ళ ఓట్లను తొలగించుడేంది? పారం 8 అనేది ఒకటుండగా.. ఫారం 6 ఇవ్వాలంటూ జబర్దస్తీ చేయడమేంది?” అంటూ ప్రజలకు ఉపశమనం కలిగించే ఆదేశాలు సుప్రీంకోర్టు చేత అంజలి భరద్వాజ్ మేడం ఇప్పించ గలిగింది.

Exit mobile version