Sweet Corn : వర్షాలు కురిసే వేళ.. రహదారుల పక్కన వేడి వేడి మొక్కపొత్తుల వాసన భలే మంత్రముగ్ధం చేస్తుంది. కాల్చిన మొక్కజొన్న (Sweet Corn) రుచిని ఆస్వాదించడానికి ఎంతో మంది ఉత్సాహంగా ఎదురుచూస్తుంటారు. అలాంటి ఈ మొక్కజొన్న తియ్యగా ఉండటం వల్ల, ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారిలో “తినాలా వద్దా?” అనే సందేహం తలెత్తడం సహజం. అయితే, పోషకాహార నిపుణుల ప్రకారం.. సరైన విధంగా తీసుకుంటే మొక్కజొన్న డయాబెటిక్ రోగులకు ప్రమాదకరం కాదని స్పష్టం చేస్తున్నారు.
Sweet Corn – షుగర్ ఉన్నవారు తినొచ్చా?
పూర్తిగా మినహాయించాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. మితంగా, శరీరానికి అనుకూలంగా తీసుకుంటే మొక్కజొన్న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని తెలిపారు. ఇందులో ఉండే ఫైబర్ శరీరంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించేలా పనిచేస్తుంది. అలాగే విటమిన్ C, B, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా లభించేవి కావటంతో ఇది ఆరోగ్యకరమైన ఆహారంగా చెప్పవచ్చు.
ఎలా తినాలి?
నేరుగా ప్రాసెస్ చేసిన మొక్కజొన్న ఉత్పత్తులు (పాప్‌కార్న్, క్యాన్డ్ కార్న్ వంటివి) కన్నా తాజా మొక్కజొన్నను ఎంచుకోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. కాల్చిన మొక్కజొన్న, ఉడికించిన గింజలు, లేదా కూరగాయలతో కలిపిన సలాడ్లు, సూపుల్లో చేర్చుకుంటే మెరుగైన ఫలితాలు పొందవచ్చు. ముఖ్యంగా మోతాదును దాటి తినకపోవడం చాలా అవసరం.
రుచికరమైన మొక్కజొన్నను డయాబెటిస్ ఉన్నవారు పూర్తిగా మానాల్సిన పనిలేదు. అయితే portion control పాటిస్తూ, ప్రకృతిసిద్ధమైన రూపంలో తీసుకుంటే ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
Also Read : Ridge Gourd Shocking Effects : కొంతమంది బీరకాయ కూర అంటే చాలా ఇష్టం..కానీ వాళ్ళకి మాత్రం డేంజర్
