Ridge Gourd : ఈ వర్షాకాల సీజన్‌లో విస్తారంగా లభించే కూరగాయల్లో బీరకాయ (Ridge Gourd) ప్రత్యేకమైనది. తక్కువ కేలరీలు, అధిక పోషకాలు కలిగిన ఈ కూరగాయను ఆరోగ్యానికి మేలు చేసే ఆహారంగా పరిగణిస్తారు. విటమిన్ A, C, B-కాంప్లెక్స్‌తో పాటు ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, జింక్, కాపర్ వంటి ఖనిజాలు బీరకాయలో సమృద్ధిగా ఉంటాయి.
బీరకాయలో అధికంగా ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అయితే, అందరికీ ఇది అనుకూలించదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా సున్నితమైన జీర్ణవ్యవస్థ ఉన్నవారు బీరకాయను అప్రమత్తంగా తినాలని సూచిస్తున్నారు.
Ridge Gourd – ఈ సమస్యలున్నవారు జాగ్రత్తగా ఉండాలి:
జీర్ణ సంబంధిత సమస్యలు: కొందరికి బీరకాయ తిన్న తర్వాత గ్యాస్, ఉబ్బరం, వికారం, విరేచనాలు వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశముంది.
అలెర్జీ ప్రభావం: చర్మం మీద మంట, దురద, వాపు, దద్దుర్లు వంటి ప్రతికూల లక్షణాలు కలగొచ్చని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.
శ్వాసకోశ సమస్యలు: బీరకాయ కారణంగా కొందరికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగవచ్చు.
కిడ్నీ సమస్యలు: మూత్రపిండాల సమస్యలతో బాధపడే వారు బీరకాయ తినే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. బీరకాయలో పొటాషియం అధికంగా ఉండటం మూలంగా, అది శరీరంలో చేరినపుడు కిడ్నీలు తగిన విధంగా ఫిల్టర్ చేయలేని ప్రమాదం ఉంది.
బీరకాయ ఆరోగ్యానికి మంచిదే అయినా, పై సమస్యలు ఉన్నవారు డాక్టర్ సలహా తీసుకుని మాత్రమే దీనిని ఆహారంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండటం ఆరోగ్యాన్ని కాపాడుకునే మొదటి మెట్టు అని గుర్తుంచుకోవాలి.
Also Read : AP Heavy Rains – IMD Alarming : కుండపోత వర్షం జర భద్రం – ఐఎండీ
