Suryakumar Yadav Growth : సూర్య కుమార్ యాదవ్ ఫిట్ నెస్ ఓకే

ఆసియా క‌ప్ లో ఎంపిక కోసం ప‌రీక్ష‌లు

Hello Telugu - Suryakumar Yadav

Hello Telugu - Suryakumar Yadav

Suryakumar Yadav : ముంబై – బీసీసీఐ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. త్వ‌ర‌లో ఆసియా కప్ టోర్నీ జ‌ర‌గ‌నుంది. ఇందుకు గాను భార‌త జ‌ట్టును ఎంపిక చేసేందుకు ప్ర‌ధాన ఆట‌గాళ్లు ఫిట్ నెస్ సర్టిఫికెట్లు స‌మ‌ర్పించాల‌ని ఆదేశించింది. ఈ మేర‌కు తాజాగా స్టార్ క్రికెట‌ర్ సూర్య కుమార్ యాద‌వ్ (Suryakumar Yadav) ఫిట్ నెస్ ప‌రీక్ష‌లో ఉత్తీర్ణ‌త సాధించాడ‌ని వెల్ల‌డించింది. ఇదిలా ఉండ‌గా సూర్యకుమార్ యాదవ్ జూన్‌లో జర్మనీలోని మ్యూనిచ్‌లో ప్రాక్టీస్ సెషన్‌లో ఉండ‌గా స‌డన్ గా గాయ‌ప‌డ్డాడు. ప‌రీక్ష‌లు చేసిన త‌న‌కు హెర్నియా ఉంద‌ని తేలింది. దీంతో అక్క‌డే ఆప‌రేష‌న్ చేయించుకున్నాడు. పూర్తి స్థాయిలో మ్యాచ్ లలో , టోర్నీలో ఆడాలంటే విధిగా ప్ర‌తి ఆట‌గాడు ఫిట్ నెస్ స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. ఈ మేర‌కు జ‌రిపిన ప‌రీక్ష‌లో త‌ను పాస్ అయ్యాడ‌ని బీసీసీఐ అధికారికంగా త‌న సోష‌ల్ మీడియా ఖాతాలో వెల్ల‌డించింది.

Suryakumar Yadav Fitness

భారత ఆసియా కప్ జట్టును ఎంపిక చేయడానికి అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ ప్యానెల్ సమావేశానికి ముందు టి20 జ‌ట్టు ప్ర‌స్తుత స్కిప్ప‌ర్ గా ఉన్నాడు సూర్యకుమార్ యాదవ్ . బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో తన ఫిట్‌నెస్ పరీక్ష‌న‌ను చేయించుకున్నాడు. చివరిసారిగా IPLలో ఆడిన ప్లేయర్-ఆఫ్-ది-సిరీస్‌గా ఎంపిక‌య్యాడు. శస్త్రచికిత్స తర్వాత తిరిగి ఆటకు ముందు ఫిట్‌నెస్ పరీక్షలు తప్పనిసరి. ఈ సంద‌ర్బంగా త‌న ఫిట్ నెస్ కు సంబంధించి ఆదివారం కీల‌క ప్ర‌క‌ట‌న చేశాడు. త‌న ఇన్ స్టా గ్రామ్ లో ఈ విధంగా పోస్ట్ చేశాడు. ఫిట్‌నెస్ తిరిగి పొందడంతో ఈ స్టైలిష్ బ్యాటర్ ఇప్పుడు మంగళవారం ముంబైలో జరిగే సెలక్షన్ కమిటీ సమావేశానికి హాజరు కానున్నాడు.

Also Read : Heavy Floods Sensational : పోటెత్తిన వ‌ర‌ద నాగార్జున సాగ‌ర్ నిండుకుండ

Exit mobile version