Heavy Floods Sensational : పోటెత్తిన వ‌ర‌ద నాగార్జున సాగ‌ర్ నిండుకుండ

1,71,974 క్యూసెక్కుల నీరు విడుద‌ల‌

Hello Telugu - Heavy Floods Sensational

Hello Telugu - Heavy Floods Sensational

Heavy Floods : న‌ల్లగొండ జిల్లా – బంగాళా ఖాతంలో ఏర్ప‌డిన అల్ప‌పీడ‌నం వాయుగుండంగా మారింది. రాబోయే మూడు రోజుల పాటు ఎడ‌తెరిపి లేకుండా వ‌ర్షాలు కురుస్తాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రించింది. ఈ త‌రుణంలో ఇటు తెలంగాణ‌లో అటు ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో వ‌ర్షాలు కుండ‌పోత‌గా కురుస్తున్నాయి. ఎక్క‌డ చూసినా నీళ్లే. భారీ వ‌ర‌ద‌ల దెబ్బ‌కు ప్రాజెక్టుల‌న్నీ నీళ్ల‌తో నిండి పోయాయి. మ‌రికొన్ని అలుగులు పారుతున్నాయి. చాలా చోట్ల రాక పోక‌ల‌కు అంత‌రాయం ఏర్ప‌డింది. తాజాగా న‌ల్ల‌గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ (Nagarjuna Sagar) ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం కొన‌సాగుతోంది. దీంతో డ్యామ్ అధికారులు 22 క్రస్ట్ గేట్లు ఐదు అడుగుల మేర పైకి ఎత్తి 1,71,974 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.

Heavy Floods Sensational in Nalgonda

ఇన్ ఫ్లో 1,98,152 క్యూసెక్కులు ఉండ‌గా ఔట్ ఫ్లో 2,13,660 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590.00 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 587.30అడుగులకు చేరుకుంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.0450 టీఎంసీలు ఉండ‌గా ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 305.6838 టీఎంసీలకు చేరుకుంది. పెద్ద ఎత్తున నీళ్లు ప్రాజెక్టుకు చేరుకోవ‌డంతో నిండుకుండ‌గా మారింది. దీంతో ప్రధాన జల విద్యుత్ కేంద్రంలో కొనసాగుతోంది విద్యుత్ ఉత్పత్తి. కాగా ఆదివారం సెల‌వు రోజు కావ‌డంతో సాగ‌ర్ అందాల‌ను త‌నివి తీరా చూసేందుకు భారీ ఎత్తున పోటెత్తారు ప‌ర్యాట‌కులు. పర్యాటకుల తాకిడి నేపద్యంలో జెన్ కో కార్యాలయం నుంచి డ్యాం వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

Also Read : Senior IAS Sanjay Jaju Interesting : సీఎస్ గా పిలిస్తే వ‌చ్చేందుకు సిద్దం

Exit mobile version