Supreme Court : ఢిల్లీ – దేశ సర్వోన్నత ప్రధాన న్యాయ స్థానం సుప్రీంకోర్టు గురువారం కీలక వ్యాఖ్యలు చేసింది. 20 ఏళ్ల కిందట ముంబైలో వరుసగా రైలు పేలుళ్లు చోటు చేసుకున్నాయి. వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు సంబంధించిన కేసు సుదీర్ఘ కాలం పాటు కొనసాగింది. తాజాగా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించేలా బాంబే హైకోర్టు (Bombay High Court) సంచలన తీర్పు వెలువరించింది. ఈ మేరకు ఈ ఘటనలో నిందితులుగా ఉన్న 12 మందిని నిర్దోషులుగా ప్రకటించింది. దీనిని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై ఇవాళ విచారణ చేపట్టింది సుప్రీంకోర్టు. ఈ మేరకు బిగ్ షాక్ ఇచ్చింది . బాంబే హైకోర్టు ఇచ్చిన తుది తీర్పుపై స్టే విధిస్తున్నట్లు ప్రకటించింది.
Supreme Court of India Shocking
కాగా హైకోర్టు ఆదేశాలతో జైలు నుంచి రిలీజ్ అయిన నిందితులను తిరిగి అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదని పేర్కొంది. అంతే కాకుండా మరాఠా సర్కార్ చేసిన అప్పీల్ పై తమ స్పందన కూడా తెలియ చేయాలని నిందితులకు నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు ధర్మాసనం. ఇక ఘటనకు సంబంధించి చూస్తే జూలై 11, 2006లో ముంబై పశ్చిమ రల్వే లైన్ లోని సబర్బన్ రైళ్లలో ఒక్కసారిగా వరుసగా బాంబు పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఈ దారుణ ఘటనలో 189 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోగా 800 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. సుదీర్ఘ విచారణ అనంతరం 2015 అక్టోబర్ లో ప్రత్యేక కోర్టు 12 మంది నిందితులను దోషులుగా తేల్చింది. వీరిలో ఐదుగురికి మరణశిక్ష విధించింది. మిగతా ఏడుగురికి జీవిత ఖైదు విధిస్తూ అప్పట్లో తీర్పు వెలువరించింది.
Also Read : ED Shocking Raids-Ambani Group : అనిల్ అంబానీ కంపెనీలపై ఈడీ దాడులు
