ED Shocking Raids-Ambani Group : అనిల్ అంబానీ కంపెనీల‌పై ఈడీ దాడులు

ఢిల్లీ, ముంబై ప్రాంతాల‌లో 50 సంస్థ‌ల్లో సోదాలు

hellotelugu-edraids

ED : ముంబై – కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ ఈడీ రంగంలోకి దిగింది. రిల‌య‌న్స్ కు చెందిన అనిల్ అంబానీకి బిగ్ షాక్ త‌గిలింది. గురువారం ఢిల్లీ, ముంబై న‌గ‌రాల‌లోని అనిల్ అంబానీకి చెందిన 50 కంపెనీల‌పై సోదాలు నిర్వ‌హించింది. భారీ ఎత్తున మ‌నీ లాండ‌రింగ్ చోటు చేసుకుంద‌ని ఈ మేర‌కు ఈడీ (ED) ఆరోపించింది. ఇందులో భాగంగానే దాడులు చేప‌ట్టిన‌ట్లు పేర్కొంది. స‌డ‌న్ గా దాడుల‌కు దిగ‌డంతో క‌ల‌క‌లం రేపింది అంబానీ ఫ్యామిలీలో. ప్ర‌స్తుతం టాప్ లో కొన‌సాగుతోంది త‌న సోద‌రుడు ముఖేష్ అంబానీకి చెందిన కంపెనీలు. కానీ అనిల్ అంబానీకి చెందిన వ్యాపార సంస్థ‌లు ప్ర‌స్తుతం కొట్టు మిట్టాడుతున్నాయి.

ED Raids on Ambani Companies

అనిల్ అంబానీతో సంబంధం ఉన్న ముంబైలోని పలు ఆస్తులపై ఈడీ దాడులు చేప‌ట్టింది. ప్రజా ధనాన్ని దోచుకునేందుకు పక్కా పథకం వేశార‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి అనిల్ అంబానీపై. భార‌తీయ స్టేట్ బ్యాంక్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. అనిల్ అంబానీ అతి పెద్ద మోస‌గాడిగా పేర్కొంది. ఆ ప్ర‌క‌ట‌న చేసిన వెంట‌నే ఈడీ రంగంలోకి దిగింది.

ఎస్బీఐ ‘మోసం’ ఖాతాదారుడిగా ప్రకటించిన కొన్ని రోజుల తర్వాత‌ అనిల్ అంబానీతో సంబంధం ఉన్న ముంబైలోని అనేక స్థలాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విస్తృత‌ దాడులు చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద దాదాపు 35 స్థలాలు, 50 కంపెనీలు మరియు 25 మందికి పైగా వ్యక్తులపై సోదాలు జరుగుతున్నాయి.

సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత, రాగా కంపెనీలు (రిలయన్స్ అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీలు) చేసిన మనీలాండరింగ్ నేరంపై ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. నేషనల్ హౌసింగ్ బ్యాంక్, సెబీ, నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ (ఎన్ఎఫ్ఆర్ఏ), బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి ఇతర ఏజెన్సీలు, సంస్థలు కూడా ఈడీతో సమాచారాన్ని పంచుకున్నాయి

యెస్ బ్యాంక్ నుండి (2017 నుండి 2019 వరకు) సుమారు ₹3000 కోట్ల అక్రమ రుణ మళ్లింపు జరిగినట్లు దర్యాప్తులో వెల్లడైంది. రుణం మంజూరు చేయడానికి ముందు, యెస్ బ్యాంక్ ప్రమోటర్లు వారి ఖాతాల్లో డబ్బు అందుకున్నట్లు ED కనుగొంది.

Also Read : Minister Seethakka Fired on KCR : కేసీఆర్ వ‌ల్ల‌నే కోర్టుల చుట్టూ తిరుగుతున్నాం

Exit mobile version