Supreme Court Shocking to EC : 65 ల‌క్ష‌ల ఓట‌ర్ల జాబితా వెల్ల‌డించాలి

ఆదేశించిన స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం

Hello Telugu - Supreme Court Shocking to EC

Hello Telugu - Supreme Court Shocking to EC

Supreme Court : ఢిల్లీ – సుప్రీంకోర్టు కోలుకోలేని షాక్ ఇచ్చింది ఎన్నిక‌ల సంఘానికి. బీహార్ ముసాయిదా ఓటర్ల జాబితా నుండి తొలగించబడిన 65 లక్షల మంది వ్యక్తుల వివరాలను, వారి తొలగింపుకు గల కారణాలైన మరణం, వలస లేదా నకిలీ వంటి వాటిని ఈసీ (EC) వెబ్ సైట్ లో ప్ర‌చురించాల‌ని ఆదేశించింది. ఈ మేర‌కు ఈనెల 19 వ‌ర‌కు డెడ్ లైన్ విధించింది. ఇందుకు సంబంధించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది ద‌ర్మాస‌నం. సుదీర్ఘ వాద‌న‌లు కొన‌సాగాయి. అంతే కాకుండా ప్రతి ఓటరు దానిని యాక్సెస్ చేయగలిగేలా ఈ జాబితాను ప్రచారం చేయాలని కూడా కోర్టు పేర్కొంది. కీలక తీర్పులో తప్పుగా పేర్లు తొలగించబడిన వారు తమ ఆధార్ కార్డుల కాపీతో పాటు తమ వాదనలను సమర్పించవచ్చని కోర్టు స్ప‌ష్టం చేసింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లు ఆధార్‌ను మినహాయించడాన్ని రుజువుగా గుర్తించాల‌ని, ఇది చాలా మంది ఓటర్లను ప్రభావితం చేస్తుందని పేర్కొంది.

Supreme Court Key Verdict

ఎన్నికలు జరగనున్న బీహార్‌లో ఓటర్ల జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించారు జస్టిస్ సూర్యకాంత్. జాబితా నుండి తొలగించబడిన 65 లక్షల మంది పేర్లలో 22 లక్షల మంది మరణించారని ఎన్నికల కమిషన్ చెప్ప‌డాన్ని త‌ప్పు ప‌ట్టింది. 22 లక్షల మంది మరణించినట్లయితే, బూత్ స్థాయిలో దానిని ఎందుకు వెల్లడించ లేద‌ని ప్ర‌శ్నించారు. అయితే భారత ఎన్నికల కమిషన్ చేసిన వాద‌న‌లు విన్నాం. ఓట‌ర్ల జాబితాలో పేర్లు క‌నిపించ‌న‌ప్ప‌టికీ ముసాయిదా జాబితాలో చేర్చ‌బ‌డ‌ని 65 ల‌క్ష‌ల మంది ఓట‌ర్ల జాబితాను జిల్లా స్థాయి వెబ్ సైట్ ల‌లో త‌ప్ప‌కుండా ప్ర‌ద‌ర్శించాల్సిందేనంటూ ఆదేశించింది సుప్రీంకోర్టు.

Also Read : Minister Anitha Vangalapudi Shocking Comments : రాచ‌రికం ఓడింది ప్ర‌జాస్వామ్యం గెలిచింది

Exit mobile version