Minister Anitha Vangalapudi Shocking Comments : రాచ‌రికం ఓడింది ప్ర‌జాస్వామ్యం గెలిచింది

మంత్రి వంగ‌ల‌పూడి అనిత షాకింగ్ కామెంట్స్

Hello Telugu - Minister Anitha Vangalapudi Shocking Comments

Hello Telugu - Minister Anitha Vangalapudi Shocking Comments

Anitha Vangalapudi : విజ‌య‌న‌గ‌రం జిల్లా – క‌డ‌ప జిల్లాలో జ‌రిగిన పులివెందుల‌, ఒంటిమిట్ట జ‌డ్పీటీసీ ఉప ఎన్నిక‌ల్లో కూట‌మి అభ్య‌ర్థులు అద్భుత విజ‌యాన్ని సాధించార‌ని అన్నారు మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌ (Anitha Vangalapudi) . ఈ గెలుపు ద్వారా రాచ‌రికం ఓడింద‌ని, ప్ర‌జాస్వామ్యం గెలిచింద‌న్నారు. గురువారం అనిత మీడియాతో మాట్లాడారు. గత 30 ఏళ్లలో కడపలో ఎక్కడ అయినా స్వచ్ఛందంగా ఓటు వేసే పరిస్థితి లేద‌న్నారు. కనీసం నామినేషన్ కూడా వేసే పరిస్థితి లేకుండా జగన్ మోహన్ రెడ్డి చేశాడ‌ని మండిప‌డ్డారు. కానీ ఈనాడు ప్రతీ ఒక్కరు స్వచ్చంధంగా బయటకు వచ్చి ఓటు వేశారని చెప్పారు. ప్రజాస్వామ్యం రుచి చూశార‌న్నారు. ఒక్క రాష్ట్రమే కాదు పులివెందుల, ఒంటిమిట్ట కూడా కూటమి వైపు ఉన్నాయని ఈ విజయం ద్వారా తెలియ చేశార‌ని అన్నారు వంగ‌ల‌పూడి అనిత‌.

AP Home Minister Anitha Vangalapudi Key Comments

ఆరు వేల ఓట్లతో పులివెందుల జెడ్పీటీసీ మెజారిటీతో కైవసం చేసుకున్నాం అన్నారు. కూటమి ప్రభుత్వానికి ప్రజలు స్వాగతం పలికార‌ని అన్నారు. వైసీపీకి కనీసం డిపాజిట్ కూడా రాలేద‌న్నారు. ప్రజాస్వామ్యాన్ని, అంబేద్కర్ రాజ్యాంగాన్ని నమ్ముకున్న వారు ఎవరూ నష్ట పోలేదన్నారు. రాజా రెడ్డి రాజ్యాంగాన్ని నమ్ముకున్న‌ జగన్ మోహన్ రెడ్డి 151 సీట్లు నుండి 11 సీట్లకి పడిపోయారంటూ ఎద్దేవా చేశారు. పోలింగ్ బూత్ లు మార్చమని గోల చేశారు. మార్చడం అనేది ఎన్నికల సంఘం చేతిలో ఉంటుందన్నారు వంగ‌ల‌పూడి అనిత‌. గత వైసీపీ ప్రభుత్వంలో పోలీసులను వారి సొంత పనులకు వాడుకున్నార‌ని ఆరోపించారు. గౌరవంగా పని చేసుకునే పరిస్థితి ఆనాడు క‌ల్పించ లేద‌న్నారు. సొంత పార్టీకి చెందిన పేర్ని నాని తప్పుగా మాట్లాడితే ఖండించ లేద‌న్నారు. త‌మ‌కు సంస్కారం ఉంద‌న్నారు. కానీ నోటికి వ‌వ‌చ్చిన‌ట్లు ఏది వ‌స్తే అది మాట్లాడితే ఎలా అని ప్ర‌శ్నించారు.

Also Read : Gutha Sukender Reddy Alarming : కాంట్రాక్టర్లకు నిధులు విడుదల చేయండి – గుత్తా

Exit mobile version