Supreme Court Strong Notice on Ladakh : లడ‌ఖ్ హింస‌పై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీస్

ప‌ర్యావ‌ర‌ణ కార్య‌క‌ర్త వాంగుఛుక్ కేసుపై విచార‌ణ

Hello Telugu - Supreme Court Strong Notice on Ladakh

Hello Telugu - Supreme Court Strong Notice on Ladakh

Supreme Court : ఢిల్లీ : కేంద్రంలోని మోదీ స‌ర్కార్ కు బిగ్ షాక్ ఇచ్చింది భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ స్థానం సుప్రీంకోర్టు. ల‌డ‌ఖ్ (Ladakh) లో చోటు చేసుకున్న హింస‌కు త‌నే కార‌ణం అంటూ ప్ర‌ముఖ ప‌ర్యావ‌ర‌ణ కార్య‌క‌ర్త సోన‌మ్ వాంగ్ చుక్ ను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాల మేర‌కు అరెస్ట్ చేశారు. ప్ర‌స్తుతం ఆయ‌న జైలులో ఉన్నారు. ఈ ఘ‌ట‌న వెనుక త‌ను ఉన్నార‌ని, ఆయ‌న ఉద్రేక పూరిత ప్ర‌సంగాల వ‌ల్ల‌నే అల్ల‌ర్లు చోటు చేసుకున్నాయ‌ని, దాడుల‌కు తెగ‌బ‌డ్డార‌ని, ఈ ఘ‌ట‌నలో న‌లుగురు ప్రాణాలు కోల్పోగా, 80 మందికి పైగా గాయ‌ప‌డ్డార‌ని దీనికంత‌టికీ త‌నే కార‌ణ‌మంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. దీనిపై తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు వాంగ్ చుక్ భార్య గీతాంజ‌లి జె ఆంగ్మో. ఈ మేర‌కు త‌న భ‌ర్త ను అకార‌ణంగా అరెస్ట్ చేశార‌ని, ఇది పూర్తిగా భార‌త రాజ్యాంగానికి విరుద్ద‌మ‌ని పేర్కొన్నారు. భ‌ర్త‌ను విడుద‌ల చేయాల‌ని కోరుతూ సుప్రీంకోర్టును (Supreme Court) ఆశ్ర‌యించారు.

Supreme Court Notice

ఈ మేర‌కు సోమ‌వారం వాంగ్ చుక్ కు సంబంధించిన పిటిష‌న్ పై విచార‌ణ చేప‌ట్టింది. ఈ కేసు విచార‌ణ‌లో భాగంగా ల‌డ‌ఖ్ హింస‌కు సంబంధించి కేంద్ర స‌ర్కార్ కు నోటీసులు జారీ చేసింది. కాగా సెప్టెంబర్ 26న కఠినమైన జాతీయ భద్రతా చట్టం (NSA) కింద వాంగ్‌చుక్‌ను అదుపులోకి తీసుకున్నారు. వాతావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ భార్య గీతాంజలి జె ఆంగ్మో న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. అనంత‌రం జ‌రిగిన విచార‌ణ‌లో కేంద్రం, కేంద్ర పాలిత ప్రాంతం ల‌డ‌ఖ్ నుండి స్పంద‌న కోరింది కోర్టు. న్యాయమూర్తులు అరవింద్ కుమార్, ఎన్ వి అంజరియాలతో కూడిన ధర్మాసనం వాంగ్‌చుక్ భార్యను నిర్బంధించడానికి గల కారణాలపై ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయడానికి నిరాకరించింది ..

Also Read : YS Sharmila Fired on AP Govt : స‌ర్కార్ వైఫ‌ల్యం ప్ర‌భుత్వ హాస్ట‌ళ్లు ఆగ‌మాగం

Exit mobile version