YS Sharmila Fired on AP Govt : స‌ర్కార్ వైఫ‌ల్యం ప్ర‌భుత్వ హాస్ట‌ళ్లు ఆగ‌మాగం

ఆవేద‌న వ్య‌క్తం చేసిన ఏపీపీసీసీ చీఫ్ ష‌ర్మిల

Hello Telugu - YS Sharmila Fired on AP Govt

Hello Telugu - YS Sharmila Fired on AP Govt

YS Sharmila : విశాఖ‌పట్నం : ఏపీ స‌ర్కార్ పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు ఏపీపీసీసీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి. సోమ‌వారం ఆమె విశాఖ‌ప‌ట్నంలో మీడియాతో మాట్లాడారు. సంక్షేమ బడుల్లో త్రాగేందుకు గుక్కెడు మంచినీళ్ళు దొర‌క‌ని ప‌రిస్థితి నెల‌కొంద‌న్నారు. ⁠కడుపుకు బుక్కెడు అన్నం పెట్టలేని దిక్కుమాలిన పాలన సీఎం చంద్రబాబుది అంటూ తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. కూటమి ప్రభుత్వ తీరు పేరు గొప్ప ఊరు దిబ్బ లాగా మారింద‌న్నారు. ⁠కురుపాం గిరిజన గురుకులంలో కలుషిత నీరు త్రాగి ⁠ఇద్దరు విద్యార్థినిలు మరణించిన ఘటనపై ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి (YS Sharmila). పాల‌నా ప‌రంగా వైఫల్యంతో ముక్కు పచ్చలారని బిడ్డలను పొట్టన పెట్టుకున్నందుకు సిగ్గు పడాల‌న్నారు. ⁠128 మంది గిరిజన బిడ్డలు ఆసుపత్రుల పాలయ్యారంటే ఇది పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యం త‌ప్పా మ‌రోటి కాద‌న్నారు.

YS Sharmila Slams AP Govt

చనిపోయిన బిడ్డల కుటుంబాలకు 50 లక్షల చొప్పున పరిహారం అందించాలని ఆమె కోరారు. ⁠అత్యవసర వార్డుల్లో చికిత్స పొందుతున్న బిడ్డలకు మెరుగైన వైద్యాన్ని అందేలా యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాల‌న్నారు. ⁠ఈ ఘటన మరోచోట పునరావృతం కాకుండా ఉన్నత స్థాయి కమిటీ వేసి విచారణ జరపాల‌న్నారు. మీ నిర్లక్ష్యాన్ని రోగాలపై నెట్టి తప్పుకుందామని చూస్తే ఊరుకొనేది లేదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ⁠గిరిజన బిడ్డలు, వారి సంక్షేమంపై ఈ ప్రభుత్వానికి లెక్కే లేదంటూ ధ్వ‌జ‌మెత్తారు. బిడ్డలు ఏం తింటున్నారో చూసే పర్యవేక్షణ అసలే లేకుండా పోయింద‌న్నారు. ⁠ఏం చేసినా అడగరని కూటమి ప్రభుత్వానికి చిన్నచూపుగా ఉంద‌న్నారు. ⁠వసతి గృహాలు కాదవి..సమస్యలకు లోగిళ్ళుగా మారాయంతో ఆవేద‌న వ్య‌క్తం చేశారు ష‌ర్మిల‌.

Also Read : Harish Rao Fired on Telangana Govt : హామీల అమ‌లులో రేవంత్ స‌ర్కార్ ఫెయిల్

Exit mobile version