Supreme Court : ఢిల్లీ – సుప్రీంకోర్టు సంచలన కామెంట్స్ చేసింది. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఆసియా కప్ 2025 మెగా టోర్నమెంట్ లో భారత, పాకిస్తాన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ ను వెంటనే రద్దు చేయాలని కోరుతూ ఓ న్యాయవాది సుప్రీంకోర్టును (Supreme Court) ఆశ్రయించారు. ఈ మేరకు అత్యవసరంగా విచారణ చేపట్టాలని విన్నవించారు. దీనిపై గురువారం విచారణ చేపట్టింది. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేసింది. పిటిషన్ ను తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేసింది. రెండు దేశాల మధ్య రాజకీయ సంబంధాలు దిగజారినప్పటికీ ఆసియా కప్ లో భారతదేశం, పాకిస్తాన్ తలపడనున్నాయి. ఇది కుదరదంటూ పిల్ ను తిరస్కరిస్తున్నట్లు పేర్కొంది.
Supreme Court Shocking Verdict onn India-Pakistan Match
ఇదిలా ఉండగా ఆసియా కప్ సెప్టెంబర్ 9న దుబాయ్ వేదికగా ఆసియా కప్ అట్టహాసంగా ప్రారంభమైంది. 10న యుఏఈతో జరిగిన మ్యాచ్ లో భారత జట్టు గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది. టోర్నీలో భాగంగా దాయాది పాకిస్తాన్ జట్టుతో కీలకమైన మ్యాచ్ భారత జట్టు ఆడనుంది. ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయని పిటిషనర్ పేర్కొన్నారు. దీని కారణంగా మ్యాచ్ గనుక జరిగితే బాగుండదంటూ , అందుకే రద్దు చేయాలని పిటిషన్ లో కోరారు. ఈనెల 14న దాయాది దేశాల మధ్య తటస్థ వేదిక ద్వారా మ్యాచ్ జరగనుంది. ఇది కేవలం మ్యాచ్, అలా ఉండనీయాలని పేర్కొంది.
పిటిషన్ ఇటీవలి ఉగ్రవాద దాడులను ఉదహరించింది . మ్యాచ్ జాతీయ గౌరవాన్ని అగౌరవ పరుస్తుందని వాదించింది. ఆసియా కప్ 2025 షెడ్యూల్ ప్రకటించినప్పటి నుండి, రెండు జట్లు క్రికెట్ పోటీలో పాల్గొనాలా వద్దా అనే దానిపై పదే పదే చర్చ జరుగుతోంది, ముఖ్యంగా పెహల్గామ్ దాడి తర్వాత ఆపరేషన్ సిందూర్ జరిగిన నేపథ్యంలో వారి రాజకీయ సంబంధాలు మరింత దిగజారిపోయాయి.
Also Read : Mallikarjun Kharge Fired on Modi Govt : మోదీ..అమిత్ షా ప్రజాస్వామ్యానికి పాతర : ఖర్గే
