గౌతం గంభీర్ పై ర‌విచంద్ర‌న్ అశ్విన్ ఫైర్

ఇష్ట‌మైన వారిని ఎంపిక చేస్తే బీసీసీఐ ఎందుకు

hellotelugu-RAshwin

చెన్నై : భార‌త క్రికెట్ జ‌ట్టు హెడ్ కోచ్ గౌతం గంభీర్ తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్నారు. త‌ను ఇష్టానుసారంగా ఆట‌గాళ్ల‌ను ఎంపిక చేస్తున్నాడ‌ని, ప్ర‌త్యేకించి శుభ్ మ‌న్ గిల్ తో క‌లిసి చెత్త నిర్ణ‌యాలు తీసుకుంటున్నాడ‌ని ఆరోపిస్తున్నారు. నిన్న మాజీ క్రికెట‌ర్ వీరేంద్ర సెహ్వాగ్ సీరియ‌స్ కామెంట్స్ చేశాడు ఈ ఇద్ద‌రిపై. త‌మ‌కు ఇష్టం వ‌చ్చిన ఆట‌గాళ్ల‌ను ఆడిస్తే ఇక బీసీసీఐ ఎందుకు ఉంద‌ని ప్ర‌శ్నించాడు. త‌న‌కు మ‌ద్ద‌తుగా మ‌రో భార‌త మాజీ క్రికెట‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. షమీ, సిరాజ్‌లను విస్మరించాలన్న గౌతమ్ గంభీర్ నిర్ణయంపై అశ్విన్ తీవ్ర ప్రశ్నలు లేవనెత్తారు.

బ్యాటింగ్ విభాగానికి అనుభవం ఎంత ముఖ్యమో, బౌలింగ్ విభాగానికి కూడా అంతే ముఖ్యం అని పేర్కొన్నాడు. భారత్ తరఫున నిలకడగా రాణిస్తున్న రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్ వంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్లను ఎందుకు విస్మరిస్తున్నారో నాకు అర్థం కావడం లేదని వాపోయాడు. అనుభవం లేని ఆటగాళ్లపై మాత్రమే ఆధారపడి ప్రధాన టోర్నమెంట్లను గెలవాలని ఆశించ లేర‌ని, ఆ విష‌యాన్ని గుర్తు పెట్టుకోవాల‌న్నాడు అశ్విన్. పెద్ద ఐసీసీ ఈవెంట్లకు ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో తెలిసిన అనుభవజ్ఞులైన మ్యాచ్ విన్నర్లు ఇప్పుడు జ‌ట్టుకు కావాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నాడు .

2027 వన్డే ప్రపంచ కప్ కోసం మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, భువనేశ్వర్ కుమార్ ముగ్గురూ పోటీలో ఉండాలని సూచించాడు. నిరూపితమైన ఆటగాళ్లను విస్మరించడం కంటే, భారత్‌కు యువత, అనుభవం మధ్య సరైన సమతుల్యత అవసరం అని అభిప్రాయ‌ప‌డ్డాడు.

Exit mobile version