Hero Rajinikanth : స్మ‌గ్ల‌ర్ దేవాగా సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్

ఆగ‌స్టు 14న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్

hellotelugu-rajinikanthcoolie

Rajinikanth : త‌మిళ సినీ రంగంలో మోస్ట్ డైన‌మిక్ డైరెక్ట‌ర్ గా గుర్తింపు పొందిన లోకేష్ క‌న‌గ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన తాజా మూవీ కూలీ. ఇందులో ముఖ్య పాత్ర పోషించాడు సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ (Rajinikanth). కీల‌క పాత్ర‌లు పోషించారు ఉపేంద్ర‌, నాగార్జున‌, శ్రుతీ హాస‌న్. ఇందుకు సంబంధించిన పోస్ట‌ర్స్, టీజ‌ర్, సాంగ్స్ కు ఊహించ‌ని రెస్పాన్స్ వ‌చ్చింది. సినిమా విడుద‌ల తేదీని ఖరారు చేశారు మూవీ మేక‌ర్స్. ప్ర‌పంచ వ్యాప్తంగా వ‌చ్చే ఆగ‌స్టు 14న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Rajinikanth As a Smuggler Deva

ఇదిలా ఉండ‌గా జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది కూలీ మూవీ గురించి. కథా ప‌రంగా చూస్తే ఇందులో ర‌జ‌నీకాంత్ ఓ స్మ‌గ్ల‌ర్ పాత్ర పోషించిన‌ట్టు టాక్. స్టోరీ లీక్ కావ‌డంతో ఒకింత ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు త‌లైవా ఫ్యాన్స్. ప్ర‌ధానంగా ఇందులో ప్రీకారం తీర్చుకునే ప్ర‌య‌త్నంలో స్మ‌గ్ల‌ర్ దేవాగా ర‌జ‌నీకాంత్ న‌టించాడ‌ని టాక్. మ‌రో కీల‌క అప్ డేట్ వ‌చ్చేసింది కూలీ గురించి. ఆగ‌స్టు 2వ తేదీన ట్రైల‌ర్ రిలీజ్ చేసేందుకు ముహూర్తం నిర్ణ‌యించారు నిర్మాణ సంస్థ‌.

ఇప్ప‌టి వ‌ర‌కు ద‌ర్శ‌కుడు లోకేష్ క‌న‌గ‌రాజ్ ఎలాంటి కామెంట్స్ చేయ‌లేదు కూలీ గురించి. ప్ర‌స్తుతం పెద్ద ఎత్తున జ‌రుగుతున్న ప్ర‌చారం మాత్రం డిఫ‌రెంట్ రోల్ లో త‌లైవా న‌టిస్తున్నాడ‌ని మాత్రం ప్ర‌క‌టించాడు. దీన్ని బ‌ట్టి చూస్తే స్మ‌గ్ల‌ర్ పాత్ర కోసం ర‌జ‌నీకాంత్ ప్ర‌య‌త్నం చేస్తున్నాడ‌ని అదే ఫైన‌ల్ అంటున్నారు. ఇక కూలీ మూవీలో స్పెష‌ల్ సాంగ్ లో దుమ్ము రేపింది పూజా హెగ్డే. ఇది టాప్ ట్రెండింగ్ లో కొన‌సాగుతోంది. జైల‌ర్ లో త‌మ‌న్నా నువ్వు కావాల‌య్యా అంటూ కైపెక్కించ‌గా ఇప్పుడు మోనికా అంటూ కుర్ర‌కారు గుండెల‌ను షేక్ చేస్తోంది.

Also Read : Actress Ranya Rao Shocking : న‌టి రన్యా రావుకు ఏడాది జైలు శిక్షa

Exit mobile version