శ్రీ‌నిధి శెట్టికి పుట్టిన రోజు శుభాకాంక్ష‌ల వెల్లువ

సోష‌ల్ మీడియాలో ప్ర‌ముఖ‌ల కంగ్రాట్స్

hellotelugu-ShrinidhiShetty

హైద‌రాబాద్ : అందాల ముద్దుగుమ్మ శ్రీ‌నిధి శెట్టి పుట్టిన రోజు ఇవాళ‌. ఈ సంద‌ర్బంగా సోష‌ల్ మీడియా వేదిక‌గా న‌టీ న‌టులు, సాంకేతిక నిపుణులు, ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు త‌న‌కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ సంద‌ర్బంగా త‌ను తాజాగా వెంక‌టేశ్ తో క‌లిసి న‌టిస్తున్న ఆద‌ర్శ కుటుంబం నుంచి ఓ స్టిల్ ను సోష‌ల్ మీడియా వేదిక‌గా మూవీ మేక‌ర్స్ పంచుకున్నారు. శ్రీనిధి శెట్టి తన 34వ పుట్టిన రోజును జరుపుకుంటోంది. వెంకటేష్, త్రివిక్రమ్ కలయికలో వస్తున్న ఈ కామెడీ-థ్రిల్లర్ చిత్రం అక్టోబర్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆమె అభిమానులు, సహనటులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియ జేస్తున్నారు. ఆమె నటిస్తున్న తాజా చిత్రం ‘ఆదర్శ కుటుంబం’ చిత్ర బృందం కూడా, ఆమె పుట్టినరోజు సందర్భంగా ఒక ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసి అభిమానులకు ఆనందాన్ని పంచింది.

ఈ పోస్టర్‌తో పాటు అందమైన శ్రీనిధి శెట్టికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మన ‘స్వర్ణ’ తనదైన ఆకర్షణతో, అమాయకత్వంతో వెండితెరపై అలరించడానికి సిద్ధమైంది అని పేర్కొన్నారు. ఈ చిత్రం అక్టోబర్ 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్నట్లు ప్రకటించారు. ఈ పోస్టర్‌లో శ్రీనిధి చాలా అందంగా కనిపిస్తున్నారు. ఆమె రిఫ్రిజిరేటర్ నుండి ఒక ఆపిల్ తీసుకుని తింటున్నట్లుగా ఉంది . వాస్తవానికి ఈ సినిమా అక్టోబర్ 9న విడుదల కావాల్సి ఉండగా, పోస్ట్-ప్రొడక్షన్ పనుల్లో జాప్యం కారణంగా వాయిదా పడింది. తాజాగా కొత్త విడుదల తేదీని అక్టోబర్ 30గా చిత్ర బృందం ప్రకటించింది. ఇప్పటికే విడుదలైన ‘ఆదర్శ కుటుంబం’ టీజర్ చిత్రంలోని ప్రధాన పాత్రలను పరిచయం చేసింది. టీజర్‌ను బట్టి చూస్తే, వెంకటేష్ ఇందులో ‘చిట్టి బాబు’ అనే పాత్రలో కనిపిస్తున్నారు. ఆయన తన రోజువారీ ఇంటి పనులతో విసిగిపోయి ఉంటారు. ఒకవైపు కొడుకు ‘సర్వ’ చదువులో వెనుకబడటం, మరోవైపు భార్య ‘స్వర్ణ’ ఇతరులకు అప్పులు ఇచ్చే అలవాటు కలిగి ఉండటం వంటి సమస్యలతో ఆయన సతమతమవుతుంటారు.

Exit mobile version