Actress Ranya Rao Shocking : న‌టి రన్యా రావుకు ఏడాది జైలు శిక్షa

బంగారం స్మ‌గ్లింగ్ కేసులో సంచ‌ల‌నం

Hello Telugu - ActressRanya Rao Shocking

Hello Telugu - ActressRanya Rao Shocking

Ranya Rao : బెంగ‌ళూరు – బంగారం స్మ‌గ్లింగ్ కేసులో క‌న్న‌డ న‌టి ర‌న్యా రావుకు (Ranya Rao) కోలుకోలేని షాక్ త‌గిలింది. ఏడాది జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. ద‌ర్యాప్తులో ర‌న్యా త‌న భాగ‌స్వామి త‌రుణ్ తో క‌లిసి దుబాయ్ లో ఒక వ‌జ్రాల కంపెనీ స్థాపించారు. ఇండియాలోకి బంగారాన్ని అక్ర‌మంగా ర‌వాణా చేసేందుకు ఒక వేదిక‌గా ఉప‌యోగించుకున్నార‌ని పోలీసుల విచార‌ణ‌లో తేలింది. పూర్తి నివేదిక‌ను కోర్టులో స‌మ‌ర్పించ‌డంతో కీల‌క తీర్పు వెలువ‌రించింది. త‌ను తొలుత మోడ‌ల్ గా , ఆ త‌ర్వాత సినీ న‌టిగా గుర్తింపు పొందింది. త‌న తండ్రి కీల‌క‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా రిటైర్ అయ్యారు. త‌న‌ను అడ్డం పెట్టుకుని ఈ గోల్డ్ స్కాంకు పాల్ప‌డిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

Actress Ranya Rao Gold Smuggling Case

న‌టి ర‌మ్యా రావు (Ranya Rao) ప‌లుమార్లు బెంగ‌ళూరు కెంపెగౌడ ఎయిర్ పోర్టు నుండి దుబాయ్ కి ప్ర‌యాణం చేయ‌డం ప‌ట్ల క‌స్ట‌మ్స్ అధికారులు క‌న్నేసి ఉంచారు. వ‌చ్చిన ప్ర‌తిసారి భారీ ఎత్తున గోల్డ్ ను తీసుకు వ‌స్తోంద‌ని గుర్తించారు. అనుమానం వ‌చ్చి ఒక‌నాడు అర్ధ‌రాత్రి విమానం దిగ‌గానే డీఆర్ఐ అధికారులు త‌నిఖీలు చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా భారీ ఎత్తున గోల్డ్ క‌డ్డీలు బ‌య‌ట ప‌డ్డాయి. దీంతో త‌న‌ను అదుపులోకి ఈసుకుని కోర్టులో హాజ‌రు ప‌ర్చారు. ఆ త‌ర్వాత జైలులో ఉన్నారు. విచార‌ణ‌కు సంబంధించి క‌స్ట‌డీలోకి తీసుకున్నారు. కస్టమ్స్, నిఘా అధికారులు అరెస్టు చేయడానికి ముందు నెలల తరబడి స్మ‌గ్లింగ్ కొనసాగినట్లు తెలుస్తోంది.

విమానాశ్రయాలలో పరిశీలన నుండి తప్పించు కోవడానికి రమ్యా రావు వీఐపీ హోదాను దుర్వినియోగం చేశారని, ఆమె సవతి తండ్రి, IPS అధికారితో సహా ఆమె సంబంధాలను ఉపయోగించు కున్నారని తేలింది. కొంతమంది కాంగ్రెస్ మంత్రులు జోక్యం చేసుకుని ఆమెకు బెయిల్ ఇప్పించడానికి ప్రయత్నించారు, కానీ ఆమెకు వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాలు అధికంగా ఉండటంతో వారి ప్రయత్నాలు విఫలమయ్యాయి.

Also Read : JC Prabhakar Reddy Shocking Comments : జ‌గ‌న్ పెద్దారెడ్డి విష‌యంలో జోక్యం చేసుకోకు

Exit mobile version