YS Sharmila Fired on NDA Govt : సూప‌ర్ సిక్స్ గ్యారెంటీస్ అట్ట‌ర్ ప్లాప్

నిప్పులు చెరిగిన ఏపీపీసీసీ చీఫ్ ష‌ర్మిల

Hello Telugu - YS Sharmila Fired on NDA Govt

Hello Telugu - YS Sharmila Fired on NDA Govt

YS Sharmila : అమ‌రావ‌తి – ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. ఏపీ కూట‌మి స‌ర్కార్ బ‌క్వాస్ అంటూ ఎద్దేవా చేశారు. ఇప్ప‌టికే ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలు సూపర్ ప్లాప్ అంటూ ఎద్దేవా చేశారు. ఆగస్ట్ 15న మహిళలకు ఉచిత బస్సు అంటున్నారని, కానీ ఈ ఉచిత బస్సు పథకం పై కూడా మ‌రో మెలిక పెట్టారంటూ మండిప‌డ్డారు. జిల్లాల వరకే పరిమితం చేస్తామ‌ని చెప్ప‌డం మ‌రోసారి మోసం చేసిన‌ట్టు కాదా అని ప్ర‌శ్నించారు. శ‌నివారం వైఎస్ ష‌ర్మిలా రెడ్డి (YS Sharmila) మీడియాతో మాట్లాడారు. చిన్న పథకానికి ఇన్ని కొర్రీలు ఎందుకు ? రాష్ట్రం మొత్తం ఉచిత ప్రయాణం కల్పిస్తే మీకు జరిగే నష్టం ఏంటి అంటూ నిల‌దీశారు.

YS Sharmila Slams NDA Govt

రాష్ట్రంలో రోజుకు 16 లక్షల మంది మహిళలు ప్రయాణిస్తున్నారని ఆర్టీసీ చెపుతోంద‌ని, ఒక జిల్లా నుంచి మరో జిల్లాకి వెళ్లడానికి ఉచితం ఎందుకు ఇవ్వరు అంటూ మండిప‌డ్డారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల మాదిరిగా రాష్ట్రం మొత్తం ఉచితంగా ప్రయాణం కల్పించాల‌ని ఆమె డిమాండ్ చేశారు. ఇక మహాశక్తి పథకాన్ని అమలు చేయాలి అంటే రాష్ట్రాన్ని అమ్మాలట. హామీలు ఇచ్చే ముందు ఈ పథకం భారం అని తెలియదా అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రెండు కోట్ల మంది మహిళలను నిలువునా మోసం చేశారు. మ్యానిఫెస్టో అంటే 5 ఏళ్లకు సరిపడే హామీలు. ఇష్టం వచ్చినప్పుడు అమలు చేసేది కాదన్నారు.

రాష్ట్రంలో రూ.11 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని చంద్రబాబుకు తెలుస‌న్నారు. అన్ని తెలిసి హామీలు ఇచ్చారని ఆరోపించారు. మరి ఇప్పుడు అమలు చేయలేమంటూ చేతులెత్తేస్తే ఎలా అని ఫైర్ అయ్యారు.
చంద్రబాబు తీరు ఏరు దాటే దాకా ఓడ మల్లన్న .ఏరు దాటాక బోడి మల్లన్న లాగా ఉందంటూ ఎద్దేవా చేశారు. నిరుద్యోగ భృతి అని నిరుద్యోగులను దారుణంగా మోసం చేశారన్నారు. 20 లక్షల ఉద్యోగాలు ఎక్కడ అనేది తెలియడం లేద‌న్నారు ష‌ర్మిలా రెడ్డి. తల్లికి వందనం కింద 20 లక్షల మంది బిడ్డలకు పథకాన్ని ఎగ్గొట్టారు. అన్నదాత సుఖీభవ ఎప్పడు ఇస్తారో తెలియద‌న్నారు.

Also Read : Bhumana Karunakar Reddy Fired on NDA Govt : గ‌న్ మెన్ తొలగింపుపై భూమ‌న సీరియ‌స్

Exit mobile version