Bhumana Karunakar Reddy Fired on NDA Govt : గ‌న్ మెన్ తొలగింపుపై భూమ‌న సీరియ‌స్

కూట‌మి స‌ర్కార్ పై తీవ్ర ఆగ్ర‌హం

Hello Telugu - Bhumana Karunakar Reddy Fired on NDA Govt

Hello Telugu - Bhumana Karunakar Reddy Fired on NDA Govt

Bhumana Karunakar Reddy : తిరుప‌తి – మాజీ టీటీడీ చైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి కూట‌మి స‌ర్కార్ పై మండిప‌డ్డారు. త‌మ పార్టీకి చెందిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గన్ మెన్ కాలేశా తొలగింపు పై ఆగ్రహం వ్య‌క్తం చేశారు.
రెండు నెలలు క్రితం పెద్దిరెడ్డికి చేయి ఫాక్చ‌ర్ అయ్యింద‌న్నారు. శ‌నివారం భూమన మీడియాతో మాట్లాడారు. ఆయన అనుకుంటే పది మంది సహాయకులను పెట్టుకునే స‌త్తా ఉంద‌న్నారు. కానీ జైలు ప‌రిస‌ర ప్రాంతాల‌లో ప్రైవేట్ వ్య‌క్తుల‌ను లోప‌లికి అనుమ‌తించ‌ర‌ని చెప్పారు. చేయి గాయం కారణం ఔదార్య పూరితమైన సహాయం చేశాడు గన్ మెన్ అని అన్నారు. అనేక మంది మంది ఏ . ఆర్. కానిస్టేబుల్స్, హోం గార్డ్స్ పని చేస్తున్నారని తెలిపారు.

Bhumana Karunakar Reddy Gun Man Removed

ఎస్పీ కార్యాలయాల్లో , బంగళాలో పది మందికి పైగా అనధికారికంగా పని చేస్తున్నారని ఆరోపించారు.
తప్పు చేసిన వారిని క్షమించను అని చెప్పిన ఎస్పీ మీరు ఆదర్శంగా నిలవాలని అన్నారు భూమన క‌రుణాక‌ర్ రెడ్డి (Bhumana Karunakar Reddy). 26 జిల్లాల్లో ఎస్పీ కార్యాలయాల్లో, బంగళాలో పని చేస్తున్న వారిపై చ‌ర్య‌లు తీసుకోగ‌ల‌రా అని ప్ర‌శ్నించారు. నలుగురు గన్ మెన్ లు, ఇంట్లో పనిచేసే వారు, తోట మాలి లు మీ బంగాళాలలో పని చేస్తున్నారంటూ ఆరోపించారు. చిత్తూరు జిల్లా ఎస్పీ మ‌ణికంఠ ఇంట్లో న‌లుగురు ఇంట్లో ప‌ని చేస్తున్నార‌ని, ఆరు మంది తోట‌మాలిలు వ‌ర్క్ చేస్తున్నార‌ని అన్నారు. అంతే కాకుండా రైల్వే డీఎస్పీ గా పనిచేస్తున్న ఎస్పీ మణికంఠ భార్య కి ఇద్దరు కానిస్టేబుల్స్ గన్ మెన్ లుగా ప‌ని చేస్తున్నార‌ని మ‌రి వారిపై చ‌ర్య‌లు తీసుకోరా అని నిల‌దీశారు.

Also Read : HYDRAA Shocking Comments : పేరుకు పోయిన చెత్త‌పై హైడ్రా క‌మిష‌న‌ర్ ఫైర్

Exit mobile version