Prabhakar Bhatt Shocking : ఆర్ఎస్ఎస్ నేత ప్ర‌భాక‌ర్ భ‌ట్ కు స‌మ‌న్లు

బిగ్ షాక్ ఇచ్చిన క‌ర్ణాట‌క పోలీసులు

Hello Telugu - Prabhakar Bhatt Shocking

Hello Telugu - Prabhakar Bhatt Shocking

Prabhakar Bhatt : బెంగ‌ళూరు : ఊహించ‌ని రీతిలో బిగ్ షాక్ ఇచ్చారు క‌ర్ణాట‌క పోలీసులు రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క్ సంఘ్ సీనియ‌ర్ నేత క‌ల్ల‌డ్కు ప్ర‌భాక‌ర్ భ‌ట్ (Prabhakar Bhatt) కు. మ‌నుషుల మ‌ధ్య విభేదాలు సృష్టించేలా అనుచిత వ్యాఖ్య‌లు చేశార‌ని, ద్వేష పూరిత ప్ర‌సంగం చేశార‌నే ఆరోప‌ణ‌లు త‌న‌పై ఉన్నాయి. ఈ మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేశారు. త‌క్ష‌ణ‌మే త‌మ ముందు హాజ‌రు కావాలంటూ స‌మన్లు జారీ చేశారు. లేక పోతే అరెస్ట్ చేయాల్సి ఉంటుంద‌ని వార్నింగ్ ఇచ్చారు. ప్ర‌స్తుతం క‌ర్ణాట‌క‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఉంది. ఇటీవ‌లే ఆ రాష్ట్రానికి చెందిన ఐటీ శాఖ మంత్రి ప్రియాంక్ ఖ‌ర్గే సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ప్ర‌భుత్వ స్థ‌లాల‌లో ఆర్ఎస్ఎస్ స‌భ‌లు, స‌మావేశాలు నిర్వ‌హించేందుకు వీలు లేద‌ని స్ప‌ష్టం చేశారు. ఈ మేర‌కు ఆయ‌న నేరుగా సీఎం సిద్ద‌రామ‌య్య‌కు ఓ లేఖ కూడా ఇచ్చారు. దీనిపై ఇంకా సీఎం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

RSS Prabhakar Bhatt Gets Summons

ఇదిలా ఉండ‌గా కల్ల‌డ్కు ప్రభాక‌ర్ భ‌ట్ ను అక్టోబ‌ర్ 30న త‌మ ముందు విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని స‌మ‌న్లలో పేర్కొన్నారు పుత్తూరు పీఎస్ పోలీసులు. కాగా త‌న‌కు జారీ చేసిన నోటీసులో భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 79, 196, 299, 302, 3(5) కింద దాఖలు చేసిన కేసు నంబర్ 118/2025 కింద కేసులు న‌మోదు చేసిన‌ట్లు తెలిపారు. భారతీయ నాగరిక సురక్ష సంహిత (BNSS), 2023 లోని సెక్షన్ 35(3) కింద విచారణ జరుగుతుంది. అక్టోబర్ 20న దక్షిణ కన్నడ జిల్లాలోని ఉప్పలిగేలో జరిగిన దీపోత్సవ కార్యక్రమంలో భట్ చేసిన ప్రసంగానికి సంబంధించిన కేసు ఇది. ఇది రెచ్చగొట్టేలా, మహిళలను కించపరిచేలా , మత సామరస్యాన్ని దెబ్బతీసేలా ఉందని ఆరోపణ‌లు ఉన్నాయి త‌న‌పై.

Also Read : New CJI-Suryakanth Approved : నూత‌న ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా జ‌స్టిస్ సూర్య‌కాంత్

Exit mobile version