Constipation Solution : మీరు కాన్స్టిపేషన్ తో బాధపడుతున్నారా? పెరుగుతో ఇవి కలిపి తినండి..

ఇంట్లో అందుబాటులో ఉండే పౌష్టిక పదార్థాల సహాయంతో ఈ సమస్యను అధిగమించవచ్చు...

Hello Telugu - Constipation Solution

Hello Telugu - Constipation Solution

Constipation : ఇప్పటి ఆధునిక జీవనశైలిలో మలబద్ధకం (Constipation) సమస్య సాధారణంగా మారిపోయింది. అయితే ఈ సమస్యను చాలా మంది బయటకు చెప్పడానికే ఇబ్బంది పడుతున్నారు. మలబద్ధకం ఉన్న వ్యక్తులు శారీరకంగా, మానసికంగా అసౌకర్యంగా భావిస్తారు. ఇది రోజువారీ పనుల్లో అడ్డంకిగా మారుతుంది. అయితే సరైన ఆహారపు అలవాట్లు, ఇంట్లో అందుబాటులో ఉండే పౌష్టిక పదార్థాల సహాయంతో ఈ సమస్యను అధిగమించవచ్చు.

Constipation – మలబద్ధకానికి ప్రధాన కారణాలు

తక్కువ ఫైబర్ ఉన్న ఆహారం, నీరు తక్కువగా తాగడం, శారీరక శ్రమ లేకపోవడం, ఒత్తిడి, తరచూ ప్రయాణాలు చేయడం, కొన్ని మందుల ప్రభావం, జీర్ణవ్యవస్థ బలహీనత, థైరాయిడ్ లేదా నాడీ సంబంధిత సమస్యల వల్ల మలబద్ధకం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

పెరుగు, అవిసె గింజలతో సహజ చికిత్స

ప్రముఖ పోషకాహార నిపుణులు సూచిస్తున్న ప్రకారం, మలబద్ధకం (Constipation) నుంచి ఉపశమనం పొందాలంటే రోజు 100 గ్రాముల తాజా పెరుగు తీసుకోవాలి. ఇందులో ఒక టీస్పూన్ అవిసె గింజలు లేదా అవి పొడిగా వేసి కలిపి, ఉదయం ఖాళీ కడుపుతో లేదా రాత్రి భోజనం తర్వాత తీసుకోవడం మంచిది. కొన్ని రోజుల్లోనే ఈ చిట్కాతో మెరుగైన మార్పును గమనించవచ్చు.

పెరుగు యొక్క ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగు ప్రోబయోటిక్ ఆహారం. ఇందులో ఉండే మంచినే బ్యాక్టీరియా జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.

జీర్ణక్రియ, ప్రేగుల కదలిక మెరుగవుతుంది

అవిసె గింజల ప్రత్యేకత

అవిసె గింజలలో కరిగే, కరగని రెండు రకాల ఫైబర్‌లు ఉంటాయి.

జీవనశైలిలో అవసరమైన మార్పులు

Also Read : Belly Fat Effective Solution : మీరు రోజు ఈ అవిసె గింజలు తిన్నారంటే ఎలాంటి వారికైనా పొట్ట తగ్గాల్సిందే

Exit mobile version