అమెరికా : ఇరాన్, అమెరికా దేశాల మధ్య కీలకమైన ఒప్పందం కుదిరింది. ట్రంప్ తన 80వ పుట్టినరోజు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్బంగా ఆయన కీలక ప్రకటన చేశారు. ఇరాన్ తో శాంతి ఒప్పందం కుదిరిందని తెలిపారు దీంతో వచ్చే శుక్రవారం రోజున కీలకమైన హార్ముజ్ జలసంధి తెరుచుకోనుందని ప్రకటించారు. స్విట్జర్లాండ్‌లో ఒప్పందంపై సంతకాలు జరిగిన తర్వాత, ప్రపంచ చమురు సరఫరాలో ఐదవ వంతు రవాణాకు ఉపయోగపడే ఇరుకైన జలమార్గం ‘హార్ముజ్ జలసంధి’ని తెరిచేందుకు . అదే సమయంలో అమెరికా నౌకాదళ దిగ్బంధనాన్ని ) తక్షణమే తొలగించేందుకు తాను పూర్తి అనుమతి ఇస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు.
ట్రంప్ తన ‘ట్రూత్ సోషల్స వేదికగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు, దీనివల్ల ప్రపంచ ఇంధన మార్కెట్లపై ఒత్తిడి తగ్గింది. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్‌తో ఒప్పందం ఇప్పుడు పూర్తయింది. అందరికీ అభినందనలు అని పేర్కొన్న ట్రంప్, దీనివల్ల హార్ముజ్ జలసంధి తిరిగి తెరుచు కుంటుందని , ఇరాన్ ఓడరేవులపై అమెరికా నౌకాదళ దిగ్బంధనం ముగుస్తుందని తెలిపారు. హార్ముజ్ జలసంధిని ఎటువంటి ఆటంకాలు లేకుండా తెరిచేందుకు, అదే సమయంలో అమెరికా నౌకాదళ దిగ్బంధనాన్ని తక్షణమే తొలగించేందుకు తాను పూర్తిగా అనుమతి ఇస్తున్నానని స్పష్టం చేశారు. ప్రపంచ నౌకలారా, మీ ఇంజిన్లను ప్రారంభించండి. చమురు ప్రవాహాన్ని మొదలు పెట్టండి అని పిలుపునిచ్చారు ట్రంప్.
