ప్ర‌ధాని మోదీ ప్ర‌స్థానం అత్యంత గొప్ప‌ది

కీల‌క వ్యాఖ్య‌లు చేసిన రాజ్ నాథ్ సింగ్

hellotelugu-RajnathSingh

న్యూఢిల్లీ : దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ త‌న రాజ‌కీయ ప్ర‌స్థానంలో 25 ఏళ్లు పూర్తి చేసుకోవ‌డం మామూలు విష‌యం కాద‌న్నారు కేంద్ర ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్. ఆయనకు రాజకీయాలంటే దేశ నిర్మాణం అన్నారు.. ఆయ‌న రాజ‌కీయ జ‌ర్నీపై కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. దేశ నిర్మాణం పట్ల ఆయనకున్న అంకితభావం, భారతదేశ ఆర్థిక వృద్ధి , 2047 నాటికి ‘వికసిత్ భారత్’ లక్ష్యాన్ని సాధించాలనే ఆయన దార్శనికతను ఈ సందర్భంగా హైలైట్ చేశారు. ఘజియాబాద్‌లో జరిగిన ‘వికసిత్ భారత్ సంకల్ప్ సభ’లో ప్రసంగిస్తూ రక్షణ మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.ప్రధాని మోదీ దృష్టిలో రాజకీయాలు అంటే కేవలం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కాదు, దేశాన్ని నిర్మించడం అని ఆయన పేర్కొన్నారు. కేవలం అధికారం కోసం లేదా ప్రభుత్వం ఏర్పాటు కోసం మాత్రమే రాజకీయాలు చేయకూడదని, దేశాన్ని , సమాజాన్ని నిర్మించే లక్ష్యంతో రాజకీయాలు సాగాలని ఆయన భావిస్తారన్నారు రాజ్ నాథ్ సింగ్.

మోదీ అధికారంలోకి రాక ముందు, రాజకీయాలు అనే పదానికి దాని అసలు అర్థం, సారాంశం కనుమరుగయ్యాయి. గత 12 ఏళ్లుగా ప్రజలకు సేవ చేయడానికి ఆయన తన సర్వస్వాన్ని ధారపోసిన తీరు చూస్తుంటే, రాజకీయాలు అనేవి కేవలం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సాధనం మాత్రమే కాదని, అవి దేశ నిర్మాణానికి ఒక మాధ్యమమని ఆయన నిరూపించారు అని ఆయన తెలిపారు. రాజ్‌నాథ్ సింగ్ ఇంకా ఇలా అన్నారు ప్రపంచంలో ఏ ప్రధానమంత్రి అయినా ఒకటి రెండు ఏళ్లలో కనీసం కొన్ని రోజులైనా సెలవు తీసుకోకుండా లేదా కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లకుండా ఉండటం మీరు ఎక్కడా చూడలేరు… కానీ ప్రధాని మోదీతో నాకు గత 25 ఏళ్లుగా పరిచయం ఉంది. ఈ కాలంలో, ముఖ్యమంత్రిగా లేదా ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, ఆయన ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదని లేదా ఒక్క రోజు కూడా పని ఆపలేదని నేను ధైర్యంగా చెప్పగలను అని చెప్పారు. ఇదే ఆయనలో ఉన్న గొప్ప లక్షణం అని గుర్తు చేశారు.

Exit mobile version