‘బోస్ట‌న్ డైన‌మిక్స్’ సీఈఓగా రోహిత్ ప్ర‌సాద్

కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన టెక్ ఆధారిత సంస్థ

hellotellugu_RhitPraasadCEO

అమెరికా : ఏఐ ఔత్సాహికుడైన రోహిత్ ప్రసాద్ బోస్ట‌న్ డైన‌మిక్స్ కంపెనీకి సీఈఓగా నియ‌మితుల‌య్యారు. ఆయ‌న‌కు ఏఐ ప‌ట్ల అపార‌మైన అనుభ‌వం ఉంది. ఏఐ ఆధారిత రోబోల తయారీపై దృష్టి సారిస్తున్న ఈ సంస్త‌కు సంస్థకు రోహిత్ ప్రసాద్ నాయకత్వం వహించనున్నారు. త‌ను అమెజాన్ లో పదేళ్లకు పైగా పనిచేశారు. అంతే కాకుండా సంస్థ అతిపెద్ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్టులలో కీలక పాత్ర పోషించిన తర్వాత ఆ సంస్థను వీడి బూస్ట‌న్ డైన‌మిక్స్ లో చేరారు. జార్ఖండ్‌లోని రాంచీలో పెరిగిన ఈ భారతీయ సంతతికి చెందిన టెక్నాలజీ ఎగ్జిక్యూటివ్ అలెక్సా, అమెజాన్ ఏఐ ప్ర‌య‌త్నాలై చేసిన కృషికి గాను పేరు పొందారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తమ యంత్రాలను మరింత తెలివైనవిగా , సమర్థవంతమైనవిగా మార్చాలని భావిస్తున్న తరుణంలో బూస్ట‌న్ డైన‌మిక్స్ కు బాధ్య‌త‌లు చేప‌ట్ట‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది టెక్నాల‌జీ రంగంలో.

రోహిత్ ప్రసాద్ నియామకం అక్టోబర్ 7 నుండి అమల్లోకి వచ్చింది. ఆరేళ్లపాటు సీఈఓగా పనిచేసి ఫిబ్రవరిలో తప్పుకున్న రాబర్ట్ ప్లేటర్ స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. ఆమోదం లభిస్తే, ప్రసాద్ స‌ద‌రు సంస్థ కు సంబంధించిన బోర్డులో కూడా చేరే అవకాశం ఉంది. రోబోటిక్స్ సంస్థకు మారడం ద్వారా, ప్రధానంగా ఏఐ, మెషిన్ లెర్నింగ్, స్పీచ్ టెక్నాలజీపై సాగిన ఆయన పని విధానంలో ఒక మార్పు చోటు చేసుకుంది. ఆ అనుభవం సంస్థ కు మ‌రింత బ‌లాన్ని చేకూర్చేలా చేస్తుంది. వాణిజ్య అవసరాల కోసం రోబోలను తయారు చేయడంపై ప్రధాన దృష్టి ఉంటుంది.

Exit mobile version