Stock Market Growth : నేడు లాభాల్లో నడుస్తున్న స్టాక్ మార్కెట్

జీఎస్టీ శ్లాబుల్లో సంస్కరణలు దేశ ఆర్థికాభివృద్ధికి తోడ్పడతాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Hello Telugu - Stock Market Growth

Hello Telugu - Stock Market Growth

Stock Market : అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లలో కోత విధించే అవకాశాలు మదుపర్లలో విశ్వాసాన్ని పెంచాయి. అలాగే ఈ నెల 12న విడుదల కానున్న ద్రవ్యోల్బణ గణాంకాలు అంచనాలకు అనుగుణంగా ఉంటాయని ఊహాగానాలు రావడంతో పెట్టుబడిదారుల ఉత్సాహం మరింతగా పెరిగింది. మరోవైపు, జీఎస్టీ శ్లాబుల్లో సంస్కరణలు దేశ ఆర్థికాభివృద్ధికి తోడ్పడతాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Stock Market Growth Updates

ఈ పరిణామాల ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock Market) లాభాల్లో కొనసాగుతున్నాయి. సోమవారం 80,787 పాయింట్ల వద్ద ముగిసిన సెన్సెక్స్‌ మంగళవారం ఉదయం 300 పాయింట్ల పైగా లాభాలతో ట్రేడింగ్ ప్రారంభించింది. ఒక దశలో 350 పాయింట్లు పెరిగి 81,000 మార్క్‌ను దాటింది. ఉదయం 10:30 గంటలకు సెన్సెక్స్‌ 190 పాయింట్ల లాభంతో 80,978 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ కూడా ఇదే బాటలో 54 పాయింట్ల లాభంతో 24,827 వద్ద ట్రేడవుతోంది.

లాభాలు – నష్టాలు నమోదు చేసిన షేర్లు

ఇక నిఫ్టీ మిడ్‌ క్యాప్‌ సూచీ 32 పాయింట్ల స్వల్ప నష్టంతో, బ్యాంక్‌ నిఫ్టీ 15 పాయింట్ల నష్టంతో కొనసాగుతున్నాయి. విదేశీ మారకంలో రూపాయి విలువ డాలర్‌తో పోల్చితే రూ.88.07గా నమోదైంది.

మార్కెట్ నిపుణుల అంచనా ప్రకారం, అంతర్జాతీయ ఆర్థిక పరిణామాలు, అమెరికా ఫెడ్‌ వడ్డీ రేట్లపై నిర్ణయాలు రాబోయే రోజుల్లో దేశీయ మార్కెట్ల దిశను నిర్ణయించనున్నాయి.

Also Read : Today Gold Price : నేడు తెలుగు రాష్ట్రాల్లో స్వల్ప తగ్గుముఖం పట్టిన పసిడి ధరలు

Exit mobile version