Stock Market : గత వారం భారీ నష్టాలను చవిచూసిన దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock Market) ఈ వారం కాస్త పాజిటివ్ సెంటిమెంట్‌తో కదులుతున్నాయి. సోమవారం, మంగళవారం వరుస లాభాలను నమోదు చేసిన సూచీలు బుధవారం మాత్రం ఊగిసలాటలో కొనసాగుతున్నాయి. జీఎస్టీ కొత్త సంస్కరణలపై బుధ, గురువారాల్లో కౌన్సిల్ చర్చలు జరగనున్న నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
Stock Market – సూచీల పరిస్థితి
మంగళవారం ముగింపు (80,157)తో పోలిస్తే బుధవారం ఉదయం స్వల్ప నష్టాలతో మొదలైన సెన్సెక్స్ లాభనష్టాల మధ్య దోబూచులాడింది. ఒక దశలో 200 పాయింట్లకు పైగా ఎగసి, మళ్లీ వెనక్కి తగ్గింది. ఉదయం 10:30 గంటల సమయంలో సెన్సెక్స్ 20 పాయింట్ల లాభంతో 80,177 వద్ద ట్రేడ్ అవుతోంది. అదే సమయంలో నిఫ్టీ కూడా స్వల్ప లాభాల్లోనే కొనసాగి, 9 పాయింట్ల లాభంతో 24,589 వద్ద ఉంది.
లాభాలు – నష్టాలు
- లాభాల్లో ఉన్న షేర్లు: పిరామిల్ ఫార్మా, మనప్పురం ఫైనాన్స్, యెస్ బ్యాంక్, డెలివరీ, గ్లెన్‌మార్క్.
- నష్టాల్లో ఉన్న షేర్లు: ఇండస్ టవర్స్, ఫీనిక్స్ మిల్స్, ఎంఫసిస్, ఇన్ఫోసిస్, కోఫోర్జ్ లిమిటెడ్.
ఇతర సూచీలు
- నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 175 పాయింట్ల లాభంతో ఉంది.
- బ్యాంక్ నిఫ్టీ 125 పాయింట్ల లాభంలో కొనసాగుతోంది.
- రూపాయి విలువ డాలర్‌తో పోల్చితే 88.00 వద్ద ట్రేడ్ అవుతోంది.
మార్కెట్ విశ్లేషకుల అంచనాల ప్రకారం, జీఎస్టీ సంస్కరణలపై కౌన్సిల్ తీసుకునే నిర్ణయాలు మార్కెట్ దిశను ప్రభావితం చేయవచ్చు. అందువల్ల మదుపర్లు తాత్కాలికంగా జాగ్రత్త వైఖరిని అవలంబిస్తున్నారని తెలుస్తోంది.
Also Read : GST Interesting Updates : ఈ నెల 5 నుంచి అమల్లోకి రానున్న కొత్త జీఎస్టీ రేట్లు
