GST Interesting Updates : ఈ నెల 5 నుంచి అమల్లోకి రానున్న కొత్త జీఎస్టీ రేట్లు

అమల్లో ఉన్న నాలుగు స్లాబ్‌లలో మార్పులు చేసి వాటిని సరళీకరించాలని కౌన్సిల్‌ పరిశీలిస్తోంది...

Hello Telugu - GST Interesting Updates

Hello Telugu - GST Interesting Updates

GST : సెప్టెంబర్‌ 3న ప్రారంభమైన రెండు రోజుల జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం ఈసారి ముందుగానే జరగడం విశేషం. జీఎస్టీ (GST) వ్యవస్థలో సంస్కరణలకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న నాలుగు స్లాబ్‌లలో మార్పులు చేసి వాటిని సరళీకరించాలని కౌన్సిల్‌ పరిశీలిస్తోంది.

GST – జీఎస్టీ స్లాబ్‌ల మార్పు ప్రతిపాదనలు

సమాచారం ప్రకారం, ప్రస్తుతం 12% జీఎస్టీ (GST) స్లాబ్‌లో ఉన్న సుమారు 99% వస్తువులను 5% శ్రేణికి మార్చే యోచనలో ప్రభుత్వం ఉంది. అలాగే, 28% స్లాబ్‌లో ఉన్న దాదాపు 90% వస్తువులను 18% స్లాబ్‌లోకి తీసుకురావాలని ప్రతిపాదనలు ఉన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ఇచ్చిన హామీని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయంపై తుది ప్రకటన వచ్చే అవకాశముంది.

ఏఏ వస్తువులు చౌక అవుతాయి?

28% నుండి 18%కి తగ్గే వస్తువులు:

వినియోగదారులకు ఊరట – పరిశ్రమలకు ఊపు

ఈ మార్పులతో నిత్యావసరాలు, గృహోపకరణాలు, వాహనాలు, ఔషధాలు వంటి వస్తువులు చౌక అవుతాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అయితే విలాసవంతమైన వస్తువులు, మద్యం, హానికరమైన ఉత్పత్తులపై పన్నులు పెరిగే అవకాశం ఉంది. దీని వల్ల వినియోగదారులు తక్కువ ధరలకు అవసరమైన వస్తువులు పొందుతారు. అదే సమయంలో పరిశ్రమల అమ్మకాలు పెరిగి, దేశీయ తయారీ రంగం, ఉపాధి రంగాలకు ఊపునిస్తుంది.

అమలులోకి వచ్చే తేదీ

కేంద్ర ప్రభుత్వం సవరించిన జీఎస్టీ రేట్లను సెప్టెంబర్‌ 5 అర్థరాత్రి నుంచే అమల్లోకి తేవాలని యోచిస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్థిక నిపుణులు వినియోగదారులకు సూచిస్తూ – “టీవీలు, ఫ్రిజ్‌లు, మోటార్ సైకిల్స్, మొబైల్‌ ఫోన్లు వంటి వస్తువులు కొనుగోలు చేయాలనుకునేవారు రెండు రోజులు వేచి చూస్తే మరింత లాభం పొందవచ్చు” అని తెలిపారు.

Also Read : S 400 Missile System Interesting : భారత్ కి రానున్న మరిన్ని ఎస్-400 క్షిపణి వ్యవస్థలు

Exit mobile version