Stock Market Growth : వరుసగా 4వ రోజు లాభాల్లో పరిగెడుతున్న స్టాక్ మార్కెట్

అంతర్జాతీయ మార్కెట్ల నుండి కూడా సానుకూల సంకేతాలు లభించడంతో, దేశీయ సూచీలు మద్దతుగా నిలిచాయి...

Hello Telugu - Stock Market Growth

Hello Telugu - Stock Market Growth

Stock Market : భారత ఆర్థిక వ్యవస్థ బలంగా, స్థిరంగా ఉందన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్ సంజయ్ మల్హోత్రా వ్యాఖ్యలు మదుపర్లలో విశ్వాసాన్ని పెంచాయి. ఫలితంగా, దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా నాలుగో రోజు లాభాల బాటలో కొనసాగాయి. అంతర్జాతీయ మార్కెట్ల (Stock Market) నుండి కూడా సానుకూల సంకేతాలు లభించడంతో, దేశీయ సూచీలు మద్దతుగా నిలిచాయి.

Stock Market – సెన్సెక్స్, నిఫ్టీ లాభాలతో ముగింపు

గురువారం మార్కెట్ (Stock Market) ప్రారంభంలోనే సెన్సెక్స్ 350 పాయింట్ల లాభంతో తెరుచుకుంది. అంతకుముందు రోజు ముగింపు స్థాయి అయిన 81,857 పాయింట్లతో పోల్చుకుంటే, సెన్సెక్స్ రోజంతా 81,921 నుండి 82,231 పాయింట్ల మధ్య కదిలింది. చివరికి, 142 పాయింట్ల లాభంతో 80,000 పాయింట్ల వద్ద రోజును ముగించింది.

ఇదే బాటలో నిఫ్టీ కూడా స్థిరంగా లాభాల దిశగా కదిలి, 33 పాయింట్ల లాభంతో 25,083 పాయింట్ల వద్ద ముగిసింది.

లాభాల్లో నిలిచిన షేర్లు

సెన్సెక్స్‌లో పీజీ ఎలక్ట్రోప్లాస్ట్, మ్యాన్‌కైండ్ ఫార్మా, సిప్లా, ఏబీ క్యాపిటల్, టిటాగర్ షేర్లు గణనీయంగా లాభపడ్డాయి. అదే సమయంలో బీఎస్ఈ లిమిటెడ్, ఏంజెల్ వన్, ఎమ్‌సీఎక్స్ ఇండియా, డాబర్ ఇండియా, వోడాఫోన్ ఐడియా షేర్లు నష్టాలను ఎదుర్కొన్నాయి.

ఇతర సూచీల స్థితిగతులు

మార్కెట్ విశ్లేషణ

ఆర్థిక రంగంలో స్థిరతకు తోడుగా, ఆర్‌బీఐ గవర్నర్‌ సంజయ్ మల్హోత్రా చేసిన భరోసా కలిగించే వ్యాఖ్యలు, అంతర్జాతీయంగా వడ్డీ రేట్లపై దిశానిర్దేశం స్పష్టత – ఇవన్నీ కలిసి మదుపర్లలో ఉత్సాహాన్ని రేకెత్తించాయి. దీని ప్రభావంగా స్టాక్ మార్కెట్లు మళ్లీ లాభాల బాటపట్టాయి.

Also Read : GST Reforms New Slabs : జీఎస్టీను 4 స్లాబుల నుంచి రెండుకు తగ్గించిన సర్కార్

Exit mobile version