Ex Minister Srinivas Goud Fired on CM : చంద్ర‌బాబును అడుక్కుంటున్న రేవంత్ రెడ్డి

నిప్పులు చెరిగిన విర‌స‌నోళ్ల శ్రీ‌నివాస్ గౌడ్

Hello Telugu - Ex Minister Srinivas Goud Fired on CM

Hello Telugu - Ex Minister Srinivas Goud Fired on CM

Srinivas Goud : హైద‌రాబాద్ – సీఎం రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. తెలంగాణ తెచ్చిన కేసీఆర్‌ను చావాలని కోరుకోవ‌డం దారుణ‌మ‌న్నారు. తెలంగాణను అడ్డుకున్న చంద్రబాబును రేవంత్ రెడ్డి అడుక్కోవ‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు. త‌న‌ మాటలను తెలంగాణ ప్రజలు సహించరని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఏమీ చేయనిదే ప్రాజెక్టులు పూర్తి అయ్యాయా అని ప్ర‌శ్నించారు. ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ వచ్చింద‌ని, ఉమ్మడి పాలమూరు జిల్లాను ఐదు జిల్లాలు చేసుకున్నామ‌న్నారు.
తన శాఖలో డబ్బులు లేవని వాకిటి శ్రీహరి అంటున్నారని, బీసీలకు రెవెన్యూ శాఖ ఇవ్వాల‌న్నారు.

Ex Minister Srinivas Goud Slams CM Revanth Reddy

బట్టలు ఉతికే వాళ్లకు, చాపలు పట్టే వాళ్లకి మంత్రి పదవులు ఇచ్చామని రేవంత్ రెడ్డి గొప్పలు చెప్తున్నారని ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. మిగతా బీసీ కులాలకు మంత్రి పదవులు ఇవ్వాలి కదా అని నిల‌దీశారు శ్రీ‌నివాస్ గౌడ్ (Srinivas Goud). నల్లమల పులి పులిలాగా కొట్లాడాలి కానీ బాబు ప్లీజ్ అంటూ అడుక్కోవ‌డం , దేబ‌రించ‌డం ఎందుకు అంటూ ఫైర్ అయ్యారు. బనకచర్లపై చర్చకు రాలేదని రేవంత్ రెడ్డి అబద్ధం చెప్పారని, ఏపీ మంత్రి నిమ్మ‌ల రామానాయుడు బనకచర్లపై చర్చ జరిగింది కట్టి తీరుతామని అన్నారని దీనిపై ప్ర‌జ‌ల‌కు స‌మాధానం చెప్పాల‌న్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో స్వంత ఎమ్మెల్యేలు కోర్టుల్లో కేసులు వేస్తున్నారని అన్నారు. రేవంత్ రెడ్డి జిల్లాకు వచ్చి మమ్మల్ని తిట్టడం తప్ప చేసింది ఏం లేదన్నారు.

పాలమూరు రంగారెడ్డిని అడ్డుకోవడానికి రేవంత్‌ను సమర్ధించే నీ గురువు చంద్రబాబు నాయుడు, ఆంధ్రా మీడియా, ఆంధ్రా రాజకీయ నేతల కుట్రలను అడ్డుకుని రాష్ట్ర నిధులతో రూ. 32 వేల కోట్లు ఖర్చు చేసి 90 శాతం పనులు పూర్తి చేసింది కేసీఆర్ కాదా అని అన్నారు.

Also Read : Jajula Srinivas Goud Leading : ఆగస్టు 7న గోవాలో ఓబీసీ జాతీయ మహాసభ

Exit mobile version