Jajula Srinivas Goud Leading : ఆగస్టు 7న గోవాలో ఓబీసీ జాతీయ మహాసభ

ప్ర‌క‌టించిన జాజుల శ్రీనివాస్ గౌడ్

Hello Telugu - Jajula Srinivas Goud Leading

Hello Telugu - Jajula Srinivas Goud Leading

Jajula Srinivas Goud : హైద‌రాబాద్ – వచ్చే నెల ఆగస్టు 7న గోవా రాష్ట్రంలోని శ్యాం ప్రసాద్ ముఖర్జీ ఇండోర్ స్టేడియంలో జాతీయ ఓబీసీ మహాసభను పెద్ద ఏత్తున నిర్వహిస్తున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ (Jajula Srinivas Goud) వెల్లడించారు.

Jajula Srinivas Goud Announced

దేశంలో మొదటిసారి మండల కమిషన్ సిఫార్సులైన ఓబీసీలకు ఉద్యోగ రంగంలో 27 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నట్టు దివంగత‌ మాజీ ప్రధాని వీపీ సింగ్ ప్రకటించిన ఆగస్టు 7 రోజున ప్రతి సంవత్సరం దేశంలోని అన్ని బిసి ఉద్యమ శక్తులను వ్యక్తులను కలుపుకొని జాతీయ ఓబీసీ మహాసభను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు

పదవ సారి జరిగే ఈ జాతీయ ఓబీసీ మహాసభకు దేశంలోని 29 రాష్ట్రాల నుండి పది వేల మంది ఓబీసీ ప్రతినిధులు హాజరవుతున్నారని, ఈ మహాసభకు దేశంలోని అఖిలపక్ష రాజకీయ పార్టీల నేతలను, ఓ బి సి జాతీయ నాయకులను ఆహ్వానించినట్లు జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు . ఉదయం 10 గంటలకు గోవా రాష్ట్రంలోని శ్యాం ప్రసాద్ ముఖర్జీ ఇండోర్ స్టేడియంలో ప్రారంభమయ్యే ఈ మహాసభకు తెలుగు రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున కదిలిర రావాలని ఆయన పిలుపునిచ్చారు

ఈ మహాసభలో జాతీయస్థాయిలో ఓబీసీలు ఎదుర్కొంటున్న డిమాండ్లపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నట్లు జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు .

Also Read : Bandaru Dattatreya Interesting Comments : హ‌ర్యానా ప్ర‌జ‌ల‌కు నెనెంతో రుణ‌ప‌డి ఉన్నా

Exit mobile version