Hero Chiranjeevi- Srikanth Odela : మెగాస్టార్ చిరంజీవితో సినిమా : శ్రీ‌కాంత్ ఓదెల

పుట్టిన రోజు సంద‌ర్బంగా సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న

Hello Telugu - Hero Chiranjeevi- Srikanth Odela

Hello Telugu - Hero Chiranjeevi- Srikanth Odela

Srikanth Odela : నానితో ద‌స‌రా తీసి స‌క్సెస్ ఫుల్ ద‌ర్శ‌కుడిగా పేరు పొందిన శ్రీ‌కాంత్ ఓదెల (Srikanth Odela) కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌ముఖ న‌టుడు మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు జ‌రుపుకున్నారు. ఆగ‌స్టు 22తో త‌ను 70 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. త్వ‌ర‌లోనే మెగాస్టార్ తో సినిమా తీస్తాన‌ని ప్ర‌క‌టించాడు. ఇందుకు సంబంధించి స్టార్ హీరో కూడా ఓకే చెప్పాడ‌ని, ఇందుకు తాను చాలా సంతోషిస్తాన‌ని పేర్కొన్నాడు. తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఏ దర్శ‌కుడికైనా మెగాస్టార్ తో సినిమా చేయాల‌ని ఉంటుంద‌న్నాడు. ఈ ఛాన్స్ ద‌క్క‌డం దేవుడు ఇచ్చిన వ‌రంగా తాను భావిస్తున్న‌ట్లు తెలిపాడు. ఈ సంద‌ర్భంగా తీవ్ర భావోద్వేగానికి లోన‌య్యాడు.

Srikanth Odela Movie with Chiranjeevi

చిన్న‌ప్ప‌టి నుంచి త‌న‌కు చిరంజీవి అంటే చ‌చ్చేంత ఇష్ట‌మ‌ని పేర్కొన్నాడు. ఒక‌సారి మెగాస్టార్ తో తాను తీసుకున్న ఫోటోను త‌ల్లికి చూపించిన విష‌యాన్ని గుర్తు చేశారు. చిరంజీవితో సినిమా తీయ‌డం క‌త్తిమీద సాము లాంటిద‌న్నాడు శ్రీ‌కాంత్ ఓదెల‌. ఇది నాకు మాత్ర‌మే కాదు ప్ర‌తి చిరంజీవి అభిమానికి సంబంధించిన సినిమా అవుతుంద‌ని మాత్రం తాను చెప్ప‌గ‌ల‌న‌ని అన్నాడు. ఈ ప్ర‌క‌ట‌న‌తో శ్రీ‌కాంత్ ఓదెల మెగాస్టార్ అభిమానుల‌లో ఉత్సాహాన్ని మ‌రింత నింపేలా చేసింది. రాబోయే రోజుల‌లో న్యూ ప్రాజెక్టు త‌న‌తోనే ప్రారంభం కానుంద‌ని చెప్ప‌క‌నే చెప్పాడు ద‌ర్శ‌కుడు.

ఇదిలా ఉండ‌గా ప్ర‌స్తుతం మెగాస్టార్ చిరంజీవి టాప్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తున్నాడు. ఇందులో కీ రోల్ పోషిస్తోంది కోలీవుడ్ స్టార్ హీరోయిన్ న‌య‌న‌తార‌. షూటింగ్ శ‌ర‌వేగంగా కొన‌సాగుతోంది. త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రానుంద‌ని తెలిపాడు అనిల్ రావిపూడి.

Also Read : Donald Trump Fired on Russia : ర‌ష్యాపై ఆంక్ష‌లు విధిస్తాం : డొనాల్డ్ ట్రంప్

Exit mobile version