Donald Trump Fired on Russia : ర‌ష్యాపై ఆంక్ష‌లు విధిస్తాం : డొనాల్డ్ ట్రంప్

మ‌రోసారి పుతిన్ ను బెదిరించిన యుస్ చీఫ్

Hello Telugu - Donald Trump Fired on Russia

Hello Telugu - Donald Trump Fired on Russia

Donald Trump : అమెరికా – యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మ‌రోసారి నోరు పారేసుకున్నారు. ఆయ‌న ప‌దే ప‌దే ర‌ష్యాను ఉద్దేశించి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఇటీవ‌లే అల‌స్కా వేదిక‌గా ర‌ష్యా చీఫ్ పుతిన్ తో చ‌ర్చించారు ట్రంప్ (Donald Trump). ఈ సంద‌ర్బంగా ఉక్రెయిన్ పై దాడికి పాల్ప‌డ వ‌ద్దంటూ కోరారు. ఇదే స‌మ‌యంలో తాము ఆర్మీ దళాల‌ను పంపించ బోమంటూ ప్ర‌క‌టించారు. ఆ వెంట‌నే మ‌న‌సు మార్చుకున్నారు. ప‌దే ప‌దే ర‌ష్యాను, ఇండియాను ల‌క్ష్యంగా చేసుకుని కామెంట్స్ చేస్తూ మ‌రింత ర‌చ్చ‌కు తెర తీసేలా చేశారు. ఈ సంద‌ర్బంగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు డొనాల్డ్ ట్రంప్. రష్యాపై ఆంక్షలు విధించాలని ట్రంప్ మరోసారి బెదిరించారు. ఇదిలా ఉండ‌గా ఉక్రెయిన్‌లోని ఒక అమెరికన్ ఫ్యాక్టరీపై రష్యా దాడి చేయడం పట్ల తాను అసంతృప్తిగా ఉన్నానంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

Donald Trump Slams Russia

దీని ఫలితంగా ఆ ఫ్యాక్టరీలో ప‌ని చేస్తున్న కొంత మంది ఉద్యోగులు గాయపడ్డారు. రెండు వారాల్లో ఉక్రెయిన్‌లో శాంతియుత పరిష్కారం దిశగా పురోగతి లేకపోతే రష్యాపై ఆంక్షలు విధిస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరింపును పునరుద్ధరించారు. భారీ ఆంక్షలు విధించ‌డ‌మో లేక భారీ సుంకాలు విధించ‌డంపై ఆలోచిస్తామ‌ని ప్ర‌క‌టించారు డొనాల్డ్ ట్రంప్. తాము జ‌రిపిన చ‌ర్చ‌ల్లో పుతిన్ సానుకూలంగా స్పందించార‌ని, యుద్దాన్ని ఆపేందుకు ఓకే చెప్పార‌ని తెలిపారు . కానీ ర‌ష్యాకు వెళ్లి పోయాక వ్లాదిమిర్ పుతిన్ త‌న నిర్ణ‌యం మార్చుకున్నార‌ని , ఆ వెంట‌నే దాడికి పాల్పడ‌డం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని ప్ర‌శ్నించారు. పుతిన్ త‌న నిర్ణ‌యం వెన‌క్కి తీసుకోవాల‌ని స్ప‌ష్టం చేశారు డొనాల్డ్ ట్రంప్.

Also Read : OpenAI New Innovation : ఇండియాలో ఓపెన్ ఏఐ కార్యాల‌యం

Exit mobile version