Trump : అమెరికా : ఉక్రెయిన్, రష్యా దేశాలు సంయమనం పాటించాలని, యుద్దాన్ని వెంటనే విరమించాలని కోరారు అమెరికా దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump). జెలెన్ స్కీ, వ్లాదిమీర్ పుతిన్ లు శాంతియుత ఒప్పందానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. గత కొంత కాలంగా ప్రపంచ వ్యాప్తంగా తాను కొలువు తీరాక ప్రపంచ వ్యాప్తంగా చోటు చేసుకున్న యుద్దాలను నిలిపి వేయడం జరిగిందన్నారు. ఇందు కోసం తాను శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నానని తెలిపారు. ఇప్పటికే ఇరు దేశాలు చాలా నష్ట పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక వైపు భారీ ఎత్తున ఆస్తి నష్టం జరిగిందని, ఇంకో వైపు పెద్ద ఎత్తున ఇరు దేశాలకు చెందిన అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయారని ఇది రెండు దేశాధినేతలకు మంచిది కాదని సూచించారు ట్రంప్. తక్షణమే యుద్దాన్ని ఆపాలని తాను కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.
Trump Asking to Stop Russia-Ukraine War
శనివారం వైట్ హౌస్ లో ట్రంప్ మీడియాతో మాట్లాడారు. తనతో భేటీ అయ్యారు ఉక్రెయిన్ చీఫ్ జెలెన్ స్కీ. తాను పదే పదే ఇరు దేశాల అధినేతలను యుద్దాన్ని వెంటనే విరమించాలని కోరుతూనే వచ్చానని, కానీ పట్టించు కోవడం లేదని వాపోయారు. ట్రంప్, జెలెన్ స్కీలు దాదాపు రెండు గంటలకు పైగా సమావేశం అయ్యారు. తగినంత రక్తం చిందించబడింది, ఆస్తి సరిహద్దులను యుద్ధం దాటింది. ఇది మీకే కాదు యావత్ ప్రపంచానికి కూడా అత్యంత అవసరమని అభిప్రాయపడింది. కైవ్ నుండి తీసుకున్న భూభాగాన్ని మాస్కో ఉంచుకోవాలని సూచించారు. అయితే పుతిన్ ఫిబ్రవరి 2022 దండయాత్రను ప్రారంభించినప్పటి నుండి ఉక్రేనియన్లు రష్యా కోల్పోయిన భూభాగాలన్నింటినీ తిరిగి పొందగలరని తాను నమ్ముతున్నానని కూడా అన్నారు.
Also Read : Minister Lokesh Important Tour : రేపటి నుంచి మంత్రి లోకేష్ ఆస్ట్రేలియా టూర్
