Sprouted Potatoes Dangerous Facts : మీరు మొలకెత్తిన బంగాళాదుంప తింటున్నారా? అయితే మీకోసమే

అలాంటి దుంపల వినియోగం ఆరోగ్యానికి తీవ్రంగా హానికరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు...

Hello Telugu - Sprouted Potatoes Dangerous Facts

Hello Telugu - Sprouted Potatoes Dangerous Facts

Sprouted Potatoes : బంగాళాదుంపలు (Potatoes) సాధారణంగా ప్రతి ఇంట్లో వంటలో విస్తృతంగా ఉపయోగించే కూరగాయ. అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉంచిన బంగాళాదుంపలు మొలకెత్తడం చాలా సహజం. ఈ మొలకలను తీసేసి వాడటం పరిపాటి అయినప్పటికీ, అలాంటి దుంపల వినియోగం ఆరోగ్యానికి తీవ్రంగా హానికరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Sprouted Potatoes – సోలానిన్‌ వల్ల ఆరోగ్యానికి ముప్పు

మొలకలు వచ్చిన లేదా ఆకుపచ్చగా మారిన బంగాళాదుంపలలో (Sprouted Potatoes) “సోలానిన్‌” (Solanine) అనే విషపూరిత పదార్థం అధికంగా ఉత్పత్తి అవుతుంది. ఇది శరీరంలోకి వెళ్లినపుడు జీర్ణవ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. వాంతులు, విరోచనాలు, కడుపు నొప్పి వంటి సమస్యలే కాదు, శరీరంలోని నరాలకు సంబంధించిన లక్షణాలుగా అలసట, కాళ్ళు చేతుల్లో నొప్పులు, తలతిరుగుడు, తిమ్మిరి వంటి లక్షణాలు కూడా కనిపించవచ్చు.

ఇటీవలి ఘటనతో ఆందోళన

తాజాగా, ఓ 25 ఏళ్ల యువకుడు మొలకెత్తిన బంగాళాదుంప (Sprouted Potatoes) కూర తినడంతో తీవ్ర అస్వస్థతకు గురై, అపస్మార స్థితికి చేరిన సంఘటన వెలుగులోకి రావడంతో ఈ విషయంలో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. శ్వాసకోశ సమస్యలు, గుండె పనితీరులో అంతరాయం వంటి తీవ్రమైన పరిణామాలు కూడా మెల్లగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.

ఇవిశేషంగా గర్భిణీలు, చిన్నపిల్లలకు ప్రమాదకరం

ఈ విషపదార్థం ప్రభావం గర్భిణీలపై, చిన్నపిల్లలపై ఎక్కువగా పడే అవకాశం ఉంది. అందువల్ల, అలాంటి బంగాళాదుంపల వినియోగాన్ని పూర్తిగా నివారించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

నిర్వహణ ఎలా ఉండాలి?

బంగాళాదుంపలను చల్లటి, పొడి ప్రదేశంలో, గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయాలి. మొలకలు వచ్చిన వెంటనే వాటిని విసరాలి. ఆకుపచ్చ రంగులోకి మారిన దుంపలను వాడరాదు. బంగాళాదుంపలు ఎక్కువ కాలం నాణ్యంగా ఉండాలంటే వాటితో పాటు ఒక యాపిల్‌ను భద్రపరచడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. యాపిల్‌ నుంచి విడుదలయ్యే ఎథిలీన్ గ్యాస్ మొలకలు రావడం ఆపుతుందని పరిశోధనలు చూపుతున్నాయి.

మొలకలు తీసేయడం సరిపోదు

చాలామంది మొలకలను తొలగించి వంటకు ఉపయోగిస్తారు. కానీ సోలానిన్‌ అన్నిభాగాల్లో వ్యాపించే అవకాశం ఉన్నందున, అలాంటి దుంపలను పూర్తిగా పారవేయడమే ఉత్తమమైన మార్గమని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. లేకపోతే ఇది తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చని హెచ్చరిస్తున్నారు.

ఆహార భద్రత విషయంలో ప్రతి చిన్న జాగ్రత్త కూడా ఎంతో కీలకం. మొలకెత్తిన లేదా ఆకుపచ్చగా మారిన బంగాళాదుంపలను వాడకుండా ఉండటం ద్వారా అనేక ఆరోగ్యపరమైన ప్రమాదాలను నివారించవచ్చని నిపుణులు స్పష్టంచేస్తున్నారు.

Also Read : Frequent Headache Sensational : మీకు పదే పదే తలనొప్పి వస్తుందా? జాగ్రత్త ఆ వ్యాధి లక్షణాలు అయ్యుండొచ్చు

Exit mobile version